ఆ రెండూ లేకుండా వరల్డ్ కప్ గెలవలేం. ఈ మాట ఎవరో అంటే లైట్ తీసుకోవచ్చు. కానీ బీసీసీఐ డైరెక్ట్ గా చెప్పడం ఇక్కడ అసలు విశేషం. ప్రస్తుతం ఇదే విషయం ఫ్యాన్స్ కు ఫుల్ పైకి ఇస్తుంది. ఆ ఎవరో కాదు దాదాపు రెండు దశాబ్దాలుగా భారత క్రికెట్ ను తమ భుజాలపై మోస్తున్న స్టార్ క్రికెటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. వీరిద్దరూ 2027 వన్డే వరల్డ్ కప్ కు ఉంటారా లేదా అనే ప్రశ్న నుంచి ఇప్పుడు రోకో జోడీ లేకపోతే గెలవలేం అని బీసీసీఐ చెప్పడం హైలెట్ గా మారింది. కోహ్లీ, రోహిత్ స్థానాలపై మరోసారి ఎందుకు చర్చ జరిగింది..? బీసీసీఐ అసలు ఏం చెప్పింది అనే విషయాలని ఇప్పుడు చూద్దాం..
న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలమైన సంగతి తెలిసిందే. కోహ్లీ ఒక హాఫ్ సెంచరీ చేసిన మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. ఇక రోహిత్ శర్మ ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో ఘోరంగా ఫెయిలయ్యాడు. దీంతో వీరిద్దరి ఫామ్ పై మరోసారి ఆందోళన ఏర్పడింది. అయితే సౌతాఫ్రికాలో జరిగే వరల్డ్ కప్‌లో కోహ్లీ రోహిత్ అనుభవ జట్టుకు ఎంతో అవసరమని బీసీసీఐ వర్గాలు కోరుతున్నాయి. టీ20, ధారావాహికలకు గుడ్ బై చెప్పిన రోహిత్, కోహ్లీ ప్రస్తుతం వడ్డెల్లో మాత్రమే ఆడాడు. వరల్డ్ కప్ కోసమే వీరిద్దరూ ఉన్నట్టు క్లియర్ గా అర్ధమవుతోంది.
అయితే 2027 వరల్డ్ కప్ కు వీరిద్దరూ జట్టులో ఉంటారా? అనే చర్చ ప్రస్తుతం నడుస్తూనే ఉంది. ఇలాంటి చర్చ వచ్చినప్పుడల్లా రోకో తమ బ్యాట్ తోనే సమాధానం చెబుతూ వచ్చారు. కానీ కివీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో ఫెయిల్ అవ్వడంతో మరోసారి చర్చ రోహిత్ ఫ్యూచర్ పై మరోసారి స్టార్ట్ అయింది. ఇలాంటి సమయంలో బీసీసీఐ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఆడాలంటే ఇంట్రెస్ట్, ఫిట్ నెస్ ఉంటే వరల్డ్ కప్‌లో వీరికి బీసీసీఐఐ కనిపిస్తోంది. సౌతాఫ్రికా పిచ్ లపై రోహిత్, కోహ్లీ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపినట్లు సమాచారం. అక్కడి పిచ్‌లపై వేగం, బౌన్స్‌ను ఫేస్ చేయడంలో వీరిద్దరి అనుభవం కీలకమవుతుందని బీసీసీఐ వెల్లడించింది.
ప్రపంచ కప్ ముందు శ్రీలంక, జింబాబ్వేతో వన్డే సిరీస్‌లు.. ఆ తర్వాత ఆసియా కప్‌తో పాటు సౌతాఫ్రికాతో ఆరు వస్తువులను ఆడాల్సి ఉంది. 2027 అక్టోబర్ 2 నుంచి నవంబర్ 21 వరకు సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా ప్రపంచకప్ జరగనుంది. అప్పటివరకు రోహిత్, కోహ్లీలు తమ ఫిట్నెస్తో పాటు ఫామ్ కొనసాగిస్తారా అనే డౌట్ ఉంది. అయితే బీసీసీఐ మాత్రం కోహ్లీ, రోహిత్ పై ఒత్తిడి తగ్గించే ప్రయత్నాలు అర్ధమవుతోంది. ఎందుకంటే భారత జట్టు వరల్డ్ కప్ గెలవాలంటే వీరిద్దరూ జట్టులో ఉండటం అత్యంత కీలకం. ఓవరాల్ గా బీసీసీఐ మాటలను బట్టి చూస్తుంటే రోహిత్, కోహ్లీ 2027 వన్దే వరల్డ్ కప్ ఆడడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The post ఆ రెండూ లేకుండా వరల్డ్ కప్ గెలవలేం appeared first on iDreamPost.
