స్మార్ట్‌ఫోన్‌లో మన వ్యక్తిగత ఫొటోలు, కాంటాక్ట్స్, బ్యాంకింగ్ వివరాలు, లొకేషన్ సమాచారం ఇలా ఎన్నో కీలక విషయాలు ఉంటాయి. అందుకే ఫోన్లోని ప్రైవసీ సెట్టింగ్‌లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కొన్ని యాప్స్‌కు అవసరం లేకపోయినా లొకేషన్, బ్యాక్‌గ్రౌండ్ డేటా వంటి అనుమతులు ఇచ్చి ఉంటాం. ఇవి నిరంతరం పనిచేసే బ్యాటరీ, మొబైల్ డేటా ఖర్చు పెరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత సమాచారం కూడా అవసరానికి మించి యాప్స్‌కు అందుబాటులో ఉంటుంది. అందుకే ఫోన్లో ఈ ఐదు సెట్టింగ్‌లను ఒకసారి పరిశీలించండి.
1. లొకేషన్ పర్మిషన్.. ప్రతి యాప్‌కూ అవసరం లేదు
కొన్ని యాప్‌లకు మీరు వాటిని ఉపయోగించినప్పుడు లొకేషన్ సమాచారం అవసరం అవుతుంది. కానీ వాటికి ఎప్పుడూ లొకేషన్ యాక్సెస్ ఇచ్చి ఉంటే, అవసరం లేని సమయంలో కూడా మీకు సంబంధించిన సమాచారం అందే అవకాశం ఉంటుంది. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఏ యాప్‌కు లొకేషన్ అనుమతి ఉందో చూడండి. అవసరమైన యాప్స్‌కు మాత్రమే అనుమతి ఇవ్వండి. సాధ్యమైన చోట అనువర్తనాన్ని ఉపయోగిస్తున్నప్పుడు మాత్రమే అనుమతించు అనే ఆప్షన్ ఎంచుకోండి. లొకేషన్ అవసరం లేని యాప్స్‌కు ఆ అనుమతిని పూర్తిగా తొలగించవచ్చు.
2. బ్యాక్‌గ్రౌండ్ డేటా
కొన్ని యాప్‌లు తెరవకపోయినా అవి బ్యాక్‌గ్రౌండ్‌లో డేటాను సింక్ చేస్తుంది. కొత్త సమాచారం కోసం పనిచేయడం, ఫైల్స్ అప్డేట్ చేయడం వంటి పనుల వల్ల మొబైల్ డేటా, బ్యాటరీ వినియోగం అవుతుంది. తరచుగా ఉపయోగించని యాప్‌లకు బ్యాక్‌గ్రౌండ్ డేటాను పరిమితం చేయండి. అయితే మెసేజింగ్, ఈమెయిల్ యాప్ వంటి వాటిలో ఈ సెట్టింగ్‌ని మార్చితే కొత్త మెసేజ్‌లు లేదా అలర్ట్‌లు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అవసరాన్ని బట్టి మాత్రమే మార్పులు చేయాలి.
3. అవసరం లేని నోటిఫికేషన్లను ఆపేయండి
ప్రతి యాప్ నుంచి నోటిఫికేషన్లు రావాల్సిన అవసరం లేదు. గేమ్స్, షాపింగ్ యాప్ యాప్స్, ప్రమోషనల్స్ నుంచి తరచూ వచ్చే అలర్ట్‌లు ఫోన్‌ను పదేపదే మేల్కొలుపుతాయి. దీనివల్ల బ్యాటరీ వినియోగం పెరగొచ్చు. ఇతర ముఖ్యమైన మెసేజ్‌లు, బ్యాంక్ అలర్ట్‌లు కూడా ఇతర నోటిఫికేషన్ల మధ్య కనిపించకుండా పోవచ్చు. ఫోన్ సెట్టింగ్‌లలో యాప్ నోటిఫికేషన్లను పరిశీలించాల్సిన అవసరం లేని వాటిని ఆఫ్ చేయండి. ముఖ్యమైన అలర్ట్‌లను ఆన్‌లో ఉంచండి.
4. సమీప పరికర స్కానింగ్ అవసరమా?
కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో నియర్ బై డివైజ్ స్కానింగ్ ఫీచర్ చుట్టుపక్కల ఉన్న వైఫై, బ్లూటూత్ పరికరాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. కొన్ని కనెక్టివిటీ ఫీచర్లకు ఇది అందుబాటులో ఉంది. అయితే ఈ సదుపాయం అవసరం లేని వారు దాన్ని ఆఫ్ చేయాలా వద్దా అనేది తమ వినియోగాన్ని బట్టి నిర్ణయించుకోవచ్చు. ఆఫ్ చేస్తే కొన్ని పరికరాలను గుర్తించడం లేదా కనెక్ట్ చేయడంలో ఇబ్బంది రావచ్చు. అందుకే ఈ సెట్టింగ్‌ను మార్చే ముందు దాని ఉపయోగాన్ని తెలుసుకోవడం మంచిది.
5. స్పెషల్ యాప్ యాక్సెస్.. అనుమతులు ఇచ్చే ముందు జాగ్రత్త
ఫోన్లో యాక్సెసబిలిటీ, నోటిఫికేషన్ యాక్సెస్, ఇన్స్టాల్ అన్నౌన్ యాప్‌లు వంటి స్పెషల్ పర్మీషన్లు ఉంటాయి. ఇవి కొన్ని యాప్‌లకు ముఖ్యమైన సౌకర్యాలు కల్పిస్తాయి. అయితే అవసరం లేని లేదా నమ్మకం లేని యాప్‌కు ఈ అనుమతులు ఇవ్వడం ప్రమాదకరం. ముఖ్యంగా తెలియని వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసిన యాప్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సెట్టింగ్స్‌లో స్పెషల్ యాప్ యాక్సెస్ విభాగాన్ని తెరిచి ఏ యాప్‌కు ఎలాంటి అనుమతులు ఉన్నాయో పరిశీలించండి. అవసరం లేని అనుమతులను తొలగించండి. గుర్తు తెలియని యాప్స్‌కు ప్రత్యేక యాక్సెస్ ఇవ్వకండి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!
