Home Latest News ట్రంప్ హత్యకు కుట్ర: పాక్ జాతీయుడికి 300 నెలల జైలు.! | డొనాల్డ్ ట్రంప్ హత్యకు పథకం | AsifMerchantsentenced | పాకిస్తాన్ | US డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ – Andhra Waves

ట్రంప్ హత్యకు కుట్ర: పాక్ జాతీయుడికి 300 నెలల జైలు.! | డొనాల్డ్ ట్రంప్ హత్యకు పథకం | AsifMerchantsentenced | పాకిస్తాన్ | US డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


డొనాల్డ్ ట్రంప్ హత్యకు వ్యూహం పన్నిన పాకిస్తాన్ జాతీయుడైన ఆసిఫ్ మెర్చంట్‌కు అమెరికా కోర్టు ఏకంగా 27 సంవత్సరాల ఆరు నెలలు (అంటే 330 నెలలు) జైలు శిక్షను ఖరారు చేసింది. విదేశీ శక్తుల అండతో అమెరికా గడ్డపై జరిగిన ఈ కుట్ర యత్నం అప్పట్లో అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది.

అమెరికా న్యాయశాఖ, దర్యాప్తు సంస్థల వివరాల ప్రకారం, 48 ఏళ్ల ఆసిఫ్ మర్చంట్ కు ఇరాన్ నిఘా వర్గాలు, రివాల్యూషనరీ గార్డ్స్ తో సంబంధాలు ఉన్నాయి. గతంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో హతమైన ఇరాన్ టాప్ కమాండర్ ఖాసం సోలేమానీ మృతికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఇరాన్ ఈ కుట్రకు తెరలేపింది. ఈ నేపథ్యంలోనే ఆసిఫ్ మర్చంట్ అమెరికాలో అడుగుపెట్టి ప్రముఖ రాజకీయ నాయకులను హతమార్చేందుకు కిరాయి హంతకుల కోసం అన్వేషణ ప్రారంభించాడు.

అయితే మర్చంట్ సంప్రదించిన వ్యక్తులు మారువేషంలో ఉన్న ఎఫ్‌బీఐ అండర్‌కవర్ ఏజెంట్లు ఈ కుట్ర భగ్నమైంది. హంతకులకు ముందస్తు చెల్లింపుగా ఐదు వేల డాలర్లు అందజేసినట్లు ప్రాసిక్యూటర్లు కోర్టులో నిరూపించారు. అనుమానాస్పద కదలికలతో దేశం విడిచిపెట్టేందుకు సిద్ధమవుతున్న సమయంలో టెక్సాస్‌లోని రిచ్‌లో ఫెడరల్ ఏజెంట్లు మర్చంట్‌ను అరెస్టు చేశారు.

ఈ విచారణ సందర్భంగా నిందితుడు తన కుటుంబ భద్రత కోసమే ఇరాన్ ఒత్తిడి మేరకు ఈ ప్లాన్‌లో స్వామ్యమయ్యానని, తానెవరినీ చంపాలని భావించలేదని చెప్పుకున్నప్పటికీ, అతని ఫోన్, ల్యాప్‌టాప్‌లో లభించిన డిజిటల్ ఆధారాలు, సోషల్ మీడియా పోస్టులు అతడి తీవ్రవాద ఉద్దేశాలను స్పష్టంగా వెల్లడించాయి.

ఇది కూడా చదవండి: ట్రంప్ హత్యకు కుట్ర భగ్నం: నిందితుడి అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం..!

అమెరికా ప్రజాస్వామ్యంపై, అత్యున్నత నాయకులపై జరిగే ఇటువంటి ప్రమాదకర దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పష్టం చేసింది. ఈ తీర్పు అంతర్జాతీయ అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు అమెరికా బలమైన సంకేతం పంపిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

విదేశీ గడ్డపై ఉగ్ర కుట్రలకు ఈ కఠిన శిక్ష ఒకగుణపాఠంలా నిలుస్తుందని తెలుస్తోంది. భవిష్యత్తులోనూ ఇటువంటి ముప్పులను ముందే పసిగట్టి తిప్పికొట్టేందుకు నిఘా వర్గాలు మరింత అప్రమత్తంగా ఉన్నాయి.

మీకు నచ్చవచ్చు: ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర?!

అగ్రరాజ్యాధినేత ట్రంప్ పై హత్యాయత్నం.. నిందితుడి కాల్చివేత

[DonaldTrump AssassinationPlot, AsifMerchantSentenced, Pakistan,  US DepartmentofJustice, TeluguOne]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird