Home Latest News రోజూ వాకింగ్ చేయలేకపోతున్నామని బాధపడుతున్నారా | ప్రతిరోజు నడవలేకపోతున్నాను చింతించకండి | రోజువారీ నడక కోసం సమయం దొరకడం లేదు మీరు తెలుసుకోవలసినది ఇక్కడ ఉంది – Andhra Waves

రోజూ వాకింగ్ చేయలేకపోతున్నామని బాధపడుతున్నారా | ప్రతిరోజు నడవలేకపోతున్నాను చింతించకండి | రోజువారీ నడక కోసం సమయం దొరకడం లేదు మీరు తెలుసుకోవలసినది ఇక్కడ ఉంది – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


రోజూ వాకింగ్ చేయలేకపోతున్నామని బాధపడుతున్నారా? మిమ్మల్ని మీరు ఎంత మోసం చేస్తున్నారో తెలుసా?

ఆఫీస్ డెస్క్ ముందు గంటల తరబడి కూర్చుని పని చేసేవాళ్లకు ఆరోగ్యం గురించి, వాకింగ్ గురించి చెప్పగానే మొదట గుర్తొచ్చే మాట సమయం లేదని చెప్పడం. రోజు ఒక గంట వ్యాయామం చేయండి, కడుపునిండా నిద్ర పోండి, సమయానికి ఆహారం తినండి అని చెప్పడం సులువే కానీ, పన్నెండు నుంచి పద్నాలుగు గంటల పని ఒత్తిడిలో ఉన్న మనిషికి అది ఎంతవరకు సాధ్యం? చాలామంది ఇదే విషయంలో గందరగోళానికి ఉంటారు.

వైద్యులు లేదా ఆరోగ్య నిపుణులు ఆరోగ్యంగా ఉండాలంటే రోజు ఒక గంట ఎక్సర్సైజ్ చేయాలని, ఒత్తిడి తగ్గించుకోవాలని, మంచి ఆహారం తీసుకోవాలని చెబుతారు.

కానీ సమయం లేకపోవడం లేదా చేయలేకపోతున్నామని సాకులు చెప్పుకోవడం మాని, చేతులు ముడుచుకుని కూర్చోకుండా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్లు చిన్న చిన్న మార్పులతో మొదలుపెట్టవచ్చు.

వ్యాయామం అంటే రోజుకు ఒక గంట తప్పనిసరిగా కేటాయిస్తేనే లాభం అని అనుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా రోజుకు పది నిమిషాల నడకతో మొదలుపెట్టినా చాలు. వీలు కుదిరినప్పుడల్లా చిన్న చిన్న విడతలుగా నడవడం, నెమ్మదిగా వారానికి కనీసం నూట యాభై నిమిషాలు వేగంగా నడవడం లాంటి వ్యాయామం అందేలా చూసుకోవాలి. పని మధ్యలో కాసేపు లేచి కదలడం, తినే ఆహారం గురించి ముందే చిన్న ప్లానింగ్ చేసుకోవడం లాంటివి చేయొచ్చు. ముఖ్యంగా వ్యాయామం కోసం ఉన్న కొద్దిపాటి నిద్రను మాత్రం తగ్గించుకోకూడదు.

*రూపశ్రీ.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird