Home Latest News విదేశీ గడ్డపై మళ్లీ వివాదస్పద వ్యాఖ్యలు: రాహుల్ తీరుపై బీజేపీ మండిపాటు.! | రాహుల్ గాంధీ | చికాగో వర్సిటీ స్పీక్ | వైరుధ్యం | భారత విదేశాంగ విధానం | ప్రధాని మోదీ – Andhra Waves

విదేశీ గడ్డపై మళ్లీ వివాదస్పద వ్యాఖ్యలు: రాహుల్ తీరుపై బీజేపీ మండిపాటు.! | రాహుల్ గాంధీ | చికాగో వర్సిటీ స్పీక్ | వైరుధ్యం | భారత విదేశాంగ విధానం | ప్రధాని మోదీ – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు, ఆ పర్యటనల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదం కావడం లేదు. పార్లమెంటు వేదికగా ప్రస్తావించాల్సిన అంశాలను ఆయన నిస్సంకోచంగా దేశంలో విదేశీ గడ్డపై మాట్లాడటం పట్ల గతంలోనూ పలు మార్లు వివాదం చేసింది. ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినా ఆయన ధోరణి మారడం లేదు, ఇది ఎంత మాత్రం సమంజసం కాదనీ.. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలూ అంటున్నాయి. తాజాగా ఆయన విదేశీ గడ్డపై నుంచి భారత విదేశాంగ విధానంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన తన అమెరికా పర్యటనలో భాగంగా చికాగో విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ ప్రతిష్టకు భంగకరంగా మారాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక సైడ్ ప్లేయర్ గా ఇంకా చెప్పాలంటే ప్రేక్షకురాలిగా మారిపోయిందని రాహుల్ చికా వర్సిటీ వేదికగా ప్రకటించారు. గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం.. ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావం కోల్పోయి పక్కకు తప్పుకుందని. ప్రపంచంలో భారత్ పాత్ర ప్రాధాన్యత దిగజారిందని. భౌగోళిక రాజకీయాలపై స్పష్టమైన అవగాహనతో పాటు సొంత ఆలోచనా విధానంతో ఉంటే భారత్ ఇప్పుడు అలా ఉందని లేదు. ఇతర దేశాలతో సంబంధాలు, భాగస్వామ్యాలు స్థిరంగా స్వతంత్ర నిర్ణయాలకు ప్రాధాన్యత ఉండేదని, అయితే ఇప్పుడు పాకిస్థాన్ దేశం వంటి అమెరికా, ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నప్పుడు భారత్ మాత్రం కీలక చర్చల నుంచి దూరంగా నిలిచిపోవడం విస్మయం గొలుపుతోందని రాహుల్ అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశాంగ విధానం తీరును రాహుల్ గాంధీ తప్పుపట్టారు. అంతర్జాతీయ సంబంధాలు కేవలం వ్యక్తిగత స్నేహాల ప్రాతిపదికన కొనసాగవని, భౌగోళిక రాజకీయాల్లో స్నేహం కంటే విధానాలకే అధిక ప్రాధాన్యత ఉంటుందని రాహుల్ సూచిస్తున్నారు. మోదీ తరచూ విదేశీ నేతలతో తన స్నేహం గురించి చెబుతుంటారని, కానీ వ్యక్తిగత స్నేహాలతో విదేశాంగ విధానం నడుస్తుందని భావించడం సరికాదన్నారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. విదేశీ గడ్డపై ప్రసంగిస్తూ దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శించింది. ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవని, అంతర్జాతీయ రాజకీయాలపై ఆయనకు కనీస అవగాహన కూడా లేదని. మోదీ నాయకత్వంలో ఇండియా ప్రపంచ వేదికపై ఏకాభిప్రాయాన్ని సాధించే శక్తిగా ఎదుగుతోందని, ఈ ఎదుగుదలను రాహుల్ జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే మరో బీజేపీ నేత ప్రదీప్ భండారీ అంతర్జాతీయ వేదికలపై రాహుల్ గాంధీ పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని. పాకిస్థాన్ అంశంపై రాహుల్‌కు ఎందుకంత ఆసక్తి అని ప్రశ్నిస్తూ, విదేశీ వేదికలపై ఆయన తీరును తప్పుపట్టారు.

ఇది కూడా చదవండి: విదేశీ గడ్డపై దేశ వ్యతిరేక వ్యాఖ్యలు: రాహుల్ తీరుపై సర్వత్రా విమర్శలు..!

చికాగోలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు దేశంలో రాజకీయ వేడిని పెంచేశాయి. రాబోయే రోజుల్లో భారత విదేశాంగ విధానం, అంతర్జాతీయ వేదికలపై దేశ పాత్రలకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.

మొత్తంమీద తటస్థులు కూడా విదేశీ గడ్డపై దేశం గురించిన విమర్శలు సరికాదని రాహుల్‌కు హితవు చెప్పారు. రాహుల్ గాంధీకి మోడీ విదేశాంగ విధానాలపై అభ్యంతరాలు ఉంటే దేశీయంగా చట్టసభల్లో ప్రస్తావించడం ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించాలని కానీ, విదేశీ పర్యటనల్లో దేశ విధానాలను పలుచన చేసే విధంగా ప్రసంగాలు చేయడం అనుచితమని చెప్పారు.

మీకు నచ్చవచ్చు: విదేశీగడ్డపై ఇవేం వ్యాఖ్యలు.. రాహుల్ తీరుపై బీజేపీ ఫైర్

నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. మోదీకి అన్నీ తెలుసు: రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్.!

[Rahul Gandhi, Chikago varsity speac, Contrvarsy, India  foreign policy,  Prime Minister Modi,TeluguOne]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird