Home సినిమా ఏపీలో ఉద్యోగాలు.. తెలంగాణ అభ్యర్థులకు శుభవార్త.. – Andhra Waves

ఏపీలో ఉద్యోగాలు.. తెలంగాణ అభ్యర్థులకు శుభవార్త.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఏపీలో ఉద్యోగాలు.. తెలంగాణ అభ్యర్థులకు శుభవార్త..


తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వలస వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం అత్యంత కీలకమైన ఉపశమనాన్ని ప్రకటించింది. వివిధ ఉద్యోగ నియామకాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో మైగ్రేషన్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేస్తూ, రాష్ట్రంలోని అన్ని ప్రధాన రిక్రూట్‌మెంట్ బోర్డులకు మరియు ప్రభుత్వ శాఖలకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి.

ఎవరికి ఈ వెసులుబాటు వర్తిస్తుంది

రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు 2024 జూన్ 1వ తేదీ లేదా అంతకంటే ముందే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వలస వచ్చిన అభ్యర్థులకు ఈ వెసులుబాటు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దరఖాస్తు సమయంలో సాంకేతికత, సర్టిఫికెట్ లేకపోవడం వల్ల ఎవరూ అవకాశం కోల్పోకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

దరఖాస్తుకు మినహాయింపు..

ఉద్యోగాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేటప్పుడు మైగ్రేషన్ సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అయితే, రాత పరీక్షలు ముగిసిన తర్వాత చేపటే సర్టిఫికెట్ వెరిఫికేషన్సమయంలో మాత్రం నిర్ణీత గడువులోపే వలస వచ్చినట్లు నిరూపించే ప్రామాణిక ధ్రువీకరణ పత్రాలను అభ్యర్థులు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది.

ఏయే నియామక సంస్థలకు ఆదేశాలు జారీ అయ్యాయి

ప్రభుత్వ ప్రకటనను తక్షణమే అమలు చేయడానికి తాజా ఉద్యోగ నియామక బోర్డులు మరియు విభాగాను ప్రభుత్వం ఆదేశించింది:

  • ఏపీపీఎస్సీ
  • ఏపీ పోలీస్ రిక్రూట్ బోర్డు
  • మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు
  • పాఠశాల విద్యాశాఖ
  • జిల్లా ఎంపిక కమిటీలు

కొత్త జిల్లాల స్థానికతపై ఇంకా తీరని అయోమయం

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన 26 జిల్లాల ప్రాతిపదికన స్థానికత (స్థానిక స్థితి) గుర్తింపునకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు తుది మార్గదర్శకాలను విడుదల చేయలేదు. దీంతో తెలంగాణ నుంచి ఏపీకి వలస వచ్చిన అభ్యర్థులు కొత్త జిల్లాల పరిధిలో స్థానికతను ఏ విధంగా క్లెయిమ్ చేయాలనే అంశంపై ఇంకా కొంత గందరగోళం ఏర్పడింది.

వేలాది మంది అభ్యర్థులకు ఊరట

ఇప్పటివరకు ఆన్‌లైన్ దరఖాస్తుల సమయంలోనే మైగ్రేషన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేయడంతో అనేకమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేక ఇబ్బందులు పడ్డారు. తాజా సవరణతో వేలాది మంది వలస అభ్యర్థులు ఉద్యోగ ప్రకటనలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా దరఖాస్తు చేసుకునే అవకాశం లభించనుంది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird