Table of Contents
తెలుగు సినిమాల్లో డైరెక్టర్ ఇప్పుడు ఎక్కడ చూసినా తమిళ మ్యూజిక్ పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు మన సినిమాలకు తెలుగు వాళ్లే ఎక్కువగా సంగీతం అందించేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మెల్లగా మారిపోతోంది. చిన్న సినిమాల దగ్గరి నుంచి వందల కోట్ల భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుల వరకు మన స్టార్ హీరోలు, డైరెక్టర్లు కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అనిరుధ్, జీవీ ప్రకాష్ కుమార్ మొదలుకొని రీసెంట్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ వరకు ప్రస్తుతం చాలామంది తమిళ స్వరకర్తలు టాలీవుడ్లోనే ఫుల్ గడుపుతున్నారు.
అనిరుధ్ కోసం క్యూ కడుతున్న స్టార్ హీరోలు
ప్రస్తుతం సౌత్‌లోనే మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. తన బీజీఎంలతో థియేటర్లను దద్దరిల్లేలా చేసే అనిరుధ్ డేట్స్ కోసం మన అగ్ర హీరోలు గట్టిగానే ట్రై చేస్తున్నారు. అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజ్ కాంబోలో రాబోయే భారీ యాక్షన్ సినిమా (AA23)కి అనిరుధే మ్యూజిక్ ఇస్తున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ప్లాన్ చేస్తున్న ప్రాజెక్ట్‌కి అనిరుధ్ పేరునే ఫైనల్ చేశారు. ఇక నందమూరి బాలకృష్ణ – కొరటాల శివ కలయికలో రానున్న సినిమాకు కూడా అనిరుధ్‌తోనే వర్క్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
వరుస సినిమాలతో ఫుల్ జీవీ..
మరోవైపు జీవీ ప్రకాష్ కుమార్ కూడా టాలీవుడ్లో వరుసగా ప్రాజెక్టులు లైన్లో పెట్టారు. మంచి మెలోడీలతో పాటు స్ట్రాంగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వగలరనే నమ్మకంతో మన మేకర్స్ ఆయనకు వరుస ఆఫర్లు ఇస్తున్నారు. వెంకటేష్ – కల్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న అనిల్ రావిపూడి మల్టీస్టారర్ సినిమాకు జీవీ ప్రకాష్ స్వరాలు సమకూరుస్తున్నారు. అలాగే దుల్కర్ సల్మాన్ – పవన్ సాధినేని కాంబోలో నవంబర్ 20న వస్తున్న ‘ఆకాశంలో ఒక తార’కు ఆయనే సంగీతం అందించారు. వీటితో పాటు ‘శ్రీశ్రీ’, ‘మిస్టర్ ప్రేమికుడు’, ‘డ్యూయెట్’ వంటి సినిమాలన్నీ జీవీ ఖాతాలోనే ఉన్నాయి.
కేవలం సీనియర్లే కాదు, తమిళంలో రీసెంట్గా ట్రెండ్ చేసిన కుర్రాళ్లను కూడా మనోళ్లు టాలీవుడ్‌కి తీసుకొస్తున్నారు. ‘కచ్చి సేర’, ‘ఆశ కూడ’ పాటలతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సాయి అభ్యంకర్.. అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో రానున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక రామ్ పోతినేని స్వయంగా దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమా (RAPO 23), బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న ‘హైందవ’, అలాగే ‘సింగా’ వంటి ప్రాజెక్టులకు సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తున్నారు.
ఎందుకీ డామినేషన్?
పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక సినిమా ఫలితాన్ని బ్యాక్‌గ్రౌండ్ స్కోరే సగానికి పైగా డిసైడ్ చేస్తోంది. యావరేజ్ సీన్‌ను కూడా తమ బీజీఎంలతో గూస్బంప్స్ తెప్పించే స్థాయికి తీసుకెళ్లడంలో కోలీవుడ్ స్వరకర్తలు సక్సెస్ అవుతున్నారు. ముఖ్యంగా సరికొత్త సౌండింగ్ తేవడం, రీల్స్‌లో ఇన్‌స్టంట్‌గా వైరల్ అవుతున్న క్యాచీ బీట్స్ కంపోజ్ చేయడంలో వీరు స్పీడ్ మన మేకర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. హీరో ఇమేజ్ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లే అవుట్‌పుట్ దొరుకుత, రెమ్యునరేషన్ ఎంతైనా సరే తమిళ దర్శకులకే మన నిర్మాతలు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్‌పై కోలీవుడ్ మ్యూజిక్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
The post కోలీవుడ్ మ్యూజిక్ డామినేషన్! iDreamPostలో మొదట కనిపించారు.
