Home సినిమా సూర్యవంశీ తమ్ముడు మెరుపు సెంచరీ.. – iDreamPost – Andhra Waves

సూర్యవంశీ తమ్ముడు మెరుపు సెంచరీ.. – iDreamPost – Andhra Waves

by andhra andhrawave
0 comments
సూర్యవంశీ తమ్ముడు మెరుపు సెంచరీ.. - iDreamPost


భారత క్రికెట్‌లో 15 ఏళ్లకే తన బ్యాటింగ్‌తో ఫ్యూచర్ స్టార్‌గా మారాడు వైభవ్ సూర్యవంశీ. వైభవ్ టాలెంట్ చూసి ప్రపంచం పొగుడుతున్న వేల ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి మరొక క్రికెటర్ దూసుకొస్తున్నాడు. వైభవ్ తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో హైలెట్ గా మారాడు. కేవలం పదేళ్ల వయసులోనే లోకల్ టోర్నమెంట్ లో సెంచరీ చేసి అన్న అడుగు జాడల్లో నడుస్తుంది. లోకల్ టోర్నమెంట్‌లో కేవలం 87 బంతుల్లోనే 107 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ 14 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

అతను కేవలం 87 బంతుల్లోనే అజేయంగా 107 పరుగులు సాధించాడు. ఈ 14 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇంత చిన్న వయసులోనే ఇంతటి టాలెంట్ తో అగ్రెస్సివ్ గా ఆడడం విశేషం. ఆశీర్వాద్ అద్భుత బ్యాటింగ్ కారణంగా తన జట్టు ఉత్కంఠభరిత పోరులో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆశీర్వాద్ మినహా అతడి జట్టులోని మిగతా తొమ్మిది మంది బ్యాటర్లు ఎవరూ కనీసం 20 పరుగుల మార్కును కూడా అందుకోలేకపోయారు. సహచరులు విఫలమైన ఒంటరి పోరాటంతో జట్టును గెలిపించాడు.

ఆశీర్వాద్‌కు ఇలాంటి ప్రదర్శనలు కొత్తేమీ కాదు. గత జూన్‌లోనూ వరుసగా రెండు శతకాలు సాధించి వార్తల్లో నిలిచాడు. అప్పటి నుంచి లోకల్ క్రికెట్ టోర్నీల్లో అతడి పేరు వినిపిస్తోంది. ఇదే స్థాయిలో రాణిస్తే రానున్న అతని ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది. క్రికెట్‌పై ఆసక్తి ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వైభవ్‌కు ఉజ్వల్ సూర్యవంశీ అనే అన్నయ్య, ఆశీర్వాద్ అనే తమ్ముడు ఉన్నారు. ఇప్పటికే తన ఆటతో గుర్తింపు పొందిన వైభవ్ ప్రస్తుతం న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టుతో ఉన్నాడు. సూర్యవంశీ సక్సెస్ ఫుల్ గా తన కెరీర్ లో దూసుకుపోతున్న సమయంలో తమ్ముడు ఆశీర్వాద్ కూడా తన టాలెంట్ తో చర్చనీయాంశంగా మారాడు.

రచయిత అవతార్

బాబు.పొలిచర్ల

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird