.webp)
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ప్రస్తుతం సినిమా ‘సలార్ 2’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్: పార్ట్ 1 – సీజ్‌ఫైర్’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో, సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ప్రశాంత్ నీల్ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు.
ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు. అలాగే, ప్రశాంత్ నీల్ సమర్పణలో రూపొందించిన ‘418’ మూవీ కూడా ఈరోజు రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్ ను కలిశారు నీల్. ఈ సందర్భంగా బర్త్ డే విశేషాలు చెప్పగా.. నా గిఫ్ట్ ఏదని ప్రభాస్ సరదాగా అడిగారు. నీల్ తర్వాత ఇస్తానని చెప్పగా.. “సలార్ 2 ఎప్పుడో చెప్పండి. అదే గిఫ్ట్” అన్నారు. దానికి వెంటనే ప్రశాంత్ నీల్.. 2027 జూన్ లో ‘సలార్ 2’ స్టార్ట్ అవుతుందని బదులిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2027 జూన్‌లో ‘సలార్ 2’ స్టార్ట్ అవుతుందన్న అప్‌డేట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ‘డ్రాగన్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా 2027 జూన్ లో విడుదల కావాలి. అంటే, ‘డ్రాగన్’ రిలీజ్ తర్వాత ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా.. ‘సలార్ 2’తో నీల్ బిజీ కానున్నారు అన్నమాట.
‘సలార్’ మొదటి భాగం దేవా, వరద రాజ మన్నార్‌ల మధ్య స్నేహం, ఖాన్సార్‌లో అధికార పోరు చుట్టూ సాగింది. చివర్లో ఇచ్చిన ట్విస్టులు రెండో భాగంపై ఆసక్తిని మరింత పెంచాయి. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ మళ్లీ తమ పాత్రల్లో కనిపించనున్న ఈ సీక్వెల్‌లో కథ ఏ మలుపులు తిరుగుతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇది కూడా చదవండి: డార్లింగ్‌తో వంగా వైల్డ్ సెలబ్రేషన్.. ‘స్పిరిట్’ ఫొటో వైరల్.!
[Salaar 2 Starts In June 2027, Salaar 2 Shooting Update, Salaar 2 June 2027, Prabhas Birthday, Prabhas Salaar 2, Salaar 2 Movie, Prabhas, Prashanth Neel, NTR Dragon, Telugu Film News]
