నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రెస్‌మీట్ పెట్టారంటే చాలు.. అక్కడ నవ్వులు, బోల్డ్ కామెంట్స్‌కు కొదవే ఉండదు. తాజాగా జరిగిన ‘జైలర్ 2’ మెగా బ్లాక్ బస్టర్ ప్రెస్మీట్లో ఆయన వేసిన సెల్ఫ్ పంచ్‌లు, ఇచ్చిన క్రేజీ అప్డేట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమా రిలీజ్ డేట్‌పై తనను తానే ట్రోల్ చేయడంతో పాటు, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్‌తో చేయబోయే భారీ ప్రాజెక్ట్‌పై నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.
ఆదర్శకుటుంబం సినిమా రిలీజ్ డేట్ గురించి అడిగిన ప్రశ్నకు నాగవంశీ తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు. “ఆ డేట్ ఏంటో మీ అందరికీ ముందే తెలుసు. సినిమా పోస్ట్‌పోన్ చేస్తున్నామంటూ ప్రెస్‌మీట్ పెట్టిన రోజే మీడియా ఫ్రెండ్స్ ఫలానా తేదీకే వస్తున్నారా అని నన్ను అడిగారు. కానీ ఆ రోజు నేను కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పుడు ఆ డేట్ నేనైతే చేతుల్లో పెట్టాను. ఆయన ప్రస్తుతం ఊటీ షూటింగ్లో ఉన్నారు, 20 రాత్రికి వచ్చేస్తారు” అని చెప్పారు.
మరోవైపు నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్లో చేయబోయే ప్రాజెక్ట్‌పై నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. నెల్సన్ టాలెంట్‌ని నమ్మి తామే స్వయంగా తెలుగులో సినిమా చేయమని అడిగామని, త్వరలోనే ఆయన మాకు సినిమా చేయబోతున్నారని స్పష్టం చేశారు. “నెల్సన్’ లాంటి స్టార్ డైరెక్టర్ని నమ్మి భవిష్యత్తులో మేమే ఓ భారీ సినిమా ప్లాన్ చేస్తున్నప్పుడు.. ఆయన ‘జైలర్ 2’ తెలుగు రిలీజ్ విషయంలో ఈ మాత్రం రిస్క్ తీసుకోవడం పెద్ద విషయమేమీ కాదు అని ధైర్యంగా ముందుకెళ్లా” అని నాగవంశీ చెప్పారు. ఓవైపు రిలీజ్ డేట్‌పై స్వయంగా జోకులు పేలుస్తూనే, మరోవైపు నెల్సన్‌తో రాబోయే ప్రాజెక్ట్‌పై నాగవంశీ ఇచ్చిన ఈ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
The post నాగవంశీ సెల్ఫ్ ట్రోల్.. నెల్సన్ ప్రాజెక్ట్‌పై క్రేజీ అప్డేట్! iDreamPostలో మొదట కనిపించారు.
