Home Latest News షుగర్ రావడానికి ముందు కనిపించే చివరి వార్నింగ్ సిగ్నల్ ఇదే.. | మధుమేహం రాకముందే చివరి హెచ్చరిక సంకేతాలు | ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు – Andhra Waves

షుగర్ రావడానికి ముందు కనిపించే చివరి వార్నింగ్ సిగ్నల్ ఇదే.. | మధుమేహం రాకముందే చివరి హెచ్చరిక సంకేతాలు | ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు – Andhra Waves

by andhra andhrawave
0 comments
షుగర్ రావడానికి ముందు కనిపించే చివరి వార్నింగ్ సిగ్నల్ ఇదే.. | మధుమేహం రాకముందే చివరి హెచ్చరిక సంకేతాలు | ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు


మన శరీరంలో ఎన్నో మార్పులు నిత్యం జరుగుతూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు చిన్నచిన్న సంకేతాలను మనం పెద్దగా పట్టించుకోం. కానీ ఆ చిన్న సంకేతాలే భవిష్యత్తులో మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే పెద్ద ముప్పునకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం లేదా షుగర్ వ్యాధి బారిన పడటానికి ముందు మన శరీరం కొన్ని ప్రత్యేకమైన హెచ్చరికలను జారీ చేస్తుంది. ఆ సంకేతాలను ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆ మహమ్మారికి పూర్తిగా దూరంగా ఉండవచ్చు. అవేంటో తెలుసుకుంటే..

మన దేశంలో దాదాపు పద్నాలుగు కోట్ల మందికి పైగా ప్రజలు ప్రీ డయాబెటిస్ ఉన్నారని పలు ఆరోగ్య సర్వేలు చెబుతున్నాయి. అయితే దురదృష్టవశాత్తు చాలా మందికి ఈ సమస్య ఉందనే విషయం కూడా అసలు తెలియదు. అసలు ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి? మధుమేహం ముందు శరీరం ఇచ్చే సిగ్నల్స్ ఏమిటి? వివరంగా తెలుసుకుంటే..

ప్రీ డయాబెటిస్..

రక్తంలో షుగర్ స్థాయిలు కొద్దిగా పెరుగుతాయి కానీ పూర్తిగా మధుమేహం అని నిర్ధారించేంత స్థాయిలో ఉండవు. వైద్యపరంగా చూస్తే హెచ్‌బీఏ1సీ పరీక్షలో మూడు నెలల యావరేజ్ 5.7 నుంచి 6.4 మధ్యలో ఉన్నా

లేదా ఖాళీ కడుపుతో చేసే ఫాస్టింగ్ షుగర్ వంద నుంచి నూట ఇరవై ఐదు మిగ్రాముల మధ్యలో ఉన్నా దానిని ప్రీ డయాబెటిస్ దశగా పరిగణిస్తారు.

ఈ దశలోనే మన శరీరంలో ఇన్సులిన్ ఏర్పడింది.

డయాబెటిస్ రావడానికి ముందు సంకేతాలు..

కేవలం షుగర్ కాకుండా గుండె జబ్బులు, బీపీ, ఫ్యాటీ లివర్ ఇతర అనారోగ్య సమస్యల ప్రమాదం కూడా ఇదే సమయంలో పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంటే.. శరీరంలో పైన చెప్పుకున్న సమస్యలు ఉంటే.. డయాబెటిస్ రావడానికి కూడా అవకాశం ఉన్నట్టే.. అయితే దీనిని చూసి ఎవరూ అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని, ఇదొక చక్కటి సువర్ణావకాశం లాంటి నిపుణులు సూచిస్తున్నారు.

ప్రపంచ ప్రఖ్యాత డయాబెటిస్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ అధ్యయనం ప్రకారం, శరీర బరువులో కేవలం ఏడు శాతం వరకు తగ్గడం , వారానికి నూట యాభై నిమిషాలు వేగంగా నడవడం ద్వారా టైప్ టూ డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని యాభై ఎనిమిది శాతం వరకు సులభంగా తగ్గించవచ్చు. అందుకే ఈ ప్రీ డయాబెటిస్ దశను జీవక్రియ సంబంధిత వ్యాధుల చివరి రివర్సిబుల్ దశగా పిలుస్తుంటారు.

ఇంటి గోడకు చిన్న పగులు కనిపించినప్పుడే దానిని సరిచేసుకోవడం చాలా సులభం, కానీ గోడ పూర్తిగా దెబ్బ తిన్న తర్వాత బాగు చేయడం కష్టం. సరిగ్గా ఆరోగ్యం పూర్తిగా క్షీణించే ముందే అలాగే అప్రమత్తమవడం చాలా ముఖ్యం. అందుకోసం శరీర బరువును అయిదు నుంచి ఏడు శాతం వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.

ఇది కూడా చదవండి ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. గుండె జబ్బులను ఆమడ దూరం ఉంటే సూత్రాలివి..!

ప్రతిరోజూ కనీసం ముప్పై నిమిషాల పాటు వేగంగా నడవడం అలవాటు చేసుకోవాలి. మైదా వంటి రిఫైండ్ కార్బోహైడ్రేట్లు , కూల్ డ్రింక్స్, షుగర్ పానీయాలకు దూరంగా ఉండాలి. అలాగే పూర్వం హెచ్‌బీఏ1సి పరీక్షను చేయించుకుంటూ ఆరోగ్యాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి.

మధుమేహం వచ్చిన తర్వాత మందులతో దానిని నియంత్రించడం కంటే, అది రాకముందే ప్రీ డయాబెటిస్ దశలో ఉన్నప్పుడే దానిని అడ్డుకోవడం ఎంతో మేలు. ఇది ఆరోగ్యానికి ఎంతో సులువైన మార్గం కూడా. కాబట్టి శరీరం ఇచ్చే హెచ్చరికలను ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుని సంతోషంగా జీవించడమే మంచి మార్గం.

*రూపశ్రీ.,మీకు నచ్చవచ్చు

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird