Home సినిమా టైటానిక్ కన్నా పెద్ద నౌక మునక! – Andhra Waves

టైటానిక్ కన్నా పెద్ద నౌక మునక! – Andhra Waves

by andhra andhrawave
0 comments
టైటానిక్ కన్నా పెద్ద నౌక మునక!


ప్రపంచంలో అత్యంత విషాదకర సముద్ర ప్రమాదం అనగానే అందరికి గుర్తుకు వచ్చేది టైటినిక్ మునక. అయితే ఇప్పుడీ స్థానంలో మరో నౌక చేరబోతుంది. టైటినిక్ కన్నా పెద్ద నౌకను ముంచివేయబోతున్నారు. ఇంతకు ఆ నౌక ఏది.. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.. ఎప్పుడు ఈ భారీ నౌకను ముంచి వేయబోతున్నారు వంటి వివరాలు ఇక్కడ ఉన్నాయి

ఒకప్పుడు సముద్రయాన చరిత్రలోనే అత్యంత వేగవంతమైన ప్రయాణంతో ప్రపంచ రికార్డు సృష్టించిన చారిత్రక అమెరికన్ ఓడ ‘ఎస్‌ఎస్‌’ యునైటెడ్ స్టేట్స్’ ఇప్పుడు జలగర్భంలో మరో అరుదైన మైలురాయిని అందుకోబోతోంది. అమెరికాలోని ఫ్లోరిడా తీరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో, డెస్టిన్-ఫోర్ట్ వాల్టన్ బీచ్ సమీపంలో ఈ భారీ నౌకను సముద్రంలో ముంచేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

దీని ద్వారా ఈ చారిత్రక ఓడ ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ పగడపు దిబ్బగా రూపాంతరం చెందనుంది. అదే సమయంలో, ఈ నౌక జ్ఞాపకాలను పదిలపరుస్తూ ఫ్లోరిడా తీరంలో ఓ ప్రత్యేక మ్యూజియాన్ని నిర్మించాలని ‘ఎస్ఎస్ యునైటెడ్ స్టేట్స్ కన్సర్వెన్సీ’ సంస్థ నిశ్చయించింది. ఇందులో భాగంగా నౌకలోని రెండు భారీ పొగగొట్టాలతో పాటు అనేక అరుదైన కళాఖండాలను ఇప్పటికే భద్రపరిచారు.

టైటానిక్ కంటే పెద్దది..

మహా నౌకా టానిక్ కంటే అతిపెద్దదైన 990 అడుగుల పొడవు కలిగిన ‘ఎస్ఎస్ యునైటెడ్ స్టేట్స్’ నిర్మాణం 1950లో అంచనా వేయబడింది. అప్పట్లోనే 70 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ వ్యయంతో నిర్మించిన ఈ నౌకను కేవలం విలాసవంతమైన ప్రయాణాలకే కాకుండా, అత్యవసర సమయాల్లో 14,000 మంది సైనికులను ఒకేసారి తరలించేలా ప్రత్యేకంగా రూపొందించారు.

1952లో తన తొలి ప్రయాణంలోనే న్యూయార్క్ నుంచి ఐరోపాకు కేవలం 3 రోజుల 11 గంటల్లో చేరుకుని సముద్ర ప్రయాణంలో సరికొత్త శకానికి నాంది పలికింది. ఆ వేగ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. హ్యారీ ట్రూమన్, ఐసెన్‌హోవర్, జాన్ ఎఫ్. కెన్నడీ, బిల్ క్లింటన్ వంటి నలుగురు అమెరికా మాజీ అధ్యక్షులు ఇందులో ఉండటం దీని చారిత్రక ప్రాధాన్యతకు నిదర్శనం.

డెస్టిన్ తీరంలో కృత్రిమ పగడపు దిబ్బగా..

1969లో సేవలను ముగించిన తర్వాత ఈ నౌక సుమారు ముప్పై ఏళ్ల పాటు ఫిలడెల్ఫియా షిప్‌యార్డ్‌లోనే నిలిచిపోయింది. 2024లో దీనిని తుక్కుగా అమ్మలా లేక పర్యావరణానికి ఉపయోగపడేలా కృత్రిమ పగడపు దిబ్బగా మార్చాలి అనే చర్చ రాగా, ఫ్లోరిడాలోని ఒకలూసా కౌంటీ దాదాపు 1 మిలియన్ డాలర్లకు దీనిని కొనుగోలు చేసింది. సముద్రంలో ముంచే ముందు పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా లోపలి భాగాలను శుభ్రం చేసి ప్రమాదకర పదార్థాలను పూర్తిగా తొలగించారు. ఈ సముద్ర పగడపు దిబ్బ ప్రాజెక్టు వల్ల సముద్ర జీవుల పెంపకంతో స్కూబా డైవింగ్, చేపల వేట వంటి పర్యాటక రంగాలకు ఊతం లభించిన స్థానిక ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని అధికారులు. నవంబర్ 12న దీన్ని ముంచి వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird