
ఈ యువ సంచలనం, స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ వ్యక్తిగత జీవితంలో ఒక కొత్త అధ్యాయం. కొద్దికాలంగా ప్రేమలో ఉన్న తన ప్రియురాలితో ఆయన నిశ్చితార్థం చేసుకున్నారు.
ప్రస్తుత భారత క్రికెట్ జట్టుతో కలిసి న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న అర్ష్‌దీప్.. అక్కడే తన ప్రేయసికి రింగ్ తొడిగి అధికారికంగా ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకున్నారు. దీనికి సంబంధించిన అందమైన క్షణాల ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
నిశ్చితార్థం చేసుకున్న అర్ష్‌దీప్ కాబోయే భార్య తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా. “జీవితం మాకెన్నో దారులు చూపించినా.. మేమిద్దరం ఒకరికొకరం దొరకడమే నాకు అత్యంత ఆనందాన్నిచ్చింది. జీవితాంతం ఇలాగే కలిసుందాం” అంటూ ఒక మనోహరమైన సందేశాన్ని రాసుకొచ్చారు.
ప్రత్యేక తేదీని ప్రస్తావిస్తూ ‘హాయ్ ఫియాన్సీ’ అంటూ ఆమె పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌కు సోషల్ మీడియాలో నిమిషాల వ్యవధిలోనే లక్షల్లో లైక్స్, శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
ఇది కూడా చదవండి: విదేశీ మహిళ దేశాధినేత ఎలా అయ్యారు.. సోనియాపై కంగన సంచలన వ్యాఖ్యలు.!
అర్ష్‌దీప్ చేతిలో ఉంగరం తీసుకున్న ఆ సుందరి మరెవరో కాదు, ప్రముఖ నటి, మోడల్ సమ్రీన్ కౌర్. జమ్మూకశ్మీర్‌కు చెందిన సమ్రీన్.. 2018 ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ మీదకు అడుగుపెట్టి బాలీవుడ్ చిత్రం ’83’, ‘నెయిల్ పాలిష్’ వెబ్‌సిరీస్‌తో పాటు పలు పంజాబీ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఇంకా పలు ప్రసిద్ధ మ్యూజిక్ ఆల్బమ్‌లలోనూ ఆమె నటించారు.
గతంలోనే తమ రిలేషన్‌షిప్‌కు సంబంధించిన కొన్ని విషయాలు ఈ ఏడాది జూలైలో అర్ష్‌దీప్ ఆమెతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ‘మై పర్సన్’ అని క్యాప్షన్ ఇవ్వడంతో వారి బంధం బయటపడింది. ఇటీవల కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తాను తీసిన వికెట్ సెలబ్రేషన్ కూడా తన ప్రేయసి కోసం చేసిందని అర్ష్‌దీప్ స్వయంగా వెల్లడించి అందరి దృష్టిని ఆకర్షించారు.

మైదానంలో తనఘాటైన బౌతో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించే అర్ష్‌దీప్ సింగ్.. వ్యక్తిగత జీవితంలో ఇలా కీలకమైన ముందడుగు వేయడంతో క్రీడా ప్రపంచానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సహచర క్రికెటర్లు, ప్రముఖులు ఈ నూతన జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే ఈ జోడీ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.
మీకు నచ్చవచ్చు: సోనియా ఆత్మకథ ఆధారంగా తెలుగులో సినిమా తీస్తా.. జగ్గారెడ్డి సంచలన ప్రకటన.!
[ Arshdeep Singh engagement, Samreen Kaur, Team India pacer, New Zealand tour, Arshdeep Singh girlfriend ]
