Home సినిమా జియో యూజర్లకు బంపర్ ఆఫర్ – iDreamPost – Andhra Waves

జియో యూజర్లకు బంపర్ ఆఫర్ – iDreamPost – Andhra Waves

by andhra andhrawave
0 comments
జియో యూజర్లకు బంపర్ ఆఫర్ - iDreamPost


దీపావళి పండగ వేళ రిలయన్స్ జియో తన హోమ్ వైఫై కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. సాధారణంగా ఇంటర్నెట్ కనెక్షన్ కోసం ప్రతి నెలా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే జియో తీసుకొచ్చిన కొత్త దీపావళి ఆఫర్‌తో ఒకేసారి 10 నెలల రీఛార్జ్ చేసుకుంటే మరో 5 నెలల పాటు అదనంగా సేవలు పొందవచ్చు. అంటే మొత్తం 15 నెలల పాటు జియో హోమ్ సేవను ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ ఆఫర్‌ను పొందడానికి స్టోర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్ నుండి ఒక ప్రత్యేక నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది.

10 రీఛార్జ్‌తో 5 నెలలు ఉచితం
జియో ప్రకటించిన దీపావళి ఆఫర్ ప్రకారం.. ప్రస్తుతం జియో హోమ్ వైఫై వాడుతున్న కస్టమర్లు ఈ ప్రయోజనాలను పొందవచ్చు. నెలకు రూ.666 చొప్పున 10 నెలలకు రీఛార్జ్ చేసుకుంటే మొత్తం రూ.6,660 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా 10 నెలల సేవలకు డబ్బులు చెల్లించిన కస్టమర్ మరో 5 నెలల పాటు అదనపు సేవలు అందిస్తారు. దీనితో మొత్తం 15 నెలల పాటు వైఫై, ఎంటర్టైన్మెంట్ సేవలను ఉపయోగించవచ్చు. ఎ

ఒక్క మిస్డ్ కాల్‌తో ఆఫర్‌ను ఎలా పొందాలి?
ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేయడం చాలా సులభం. ముందుగా మీ జియో హోమ్ కనెక్షన్‌కు ఏ మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేశారో గుర్తించాలి. అదే నంబర్‌తో 8219582195కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఆ తర్వాత జియో నుంచి మీ ఫోన్‌కు ఒక నిర్ధారణ సందేశం వస్తుంది. అందులో ఇచ్చిన సూచనలు, నిబంధనల ప్రకారం తదుపరి ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ ప్రక్రియ తర్వాత అర్హత ఉన్న కస్టమర్లు ఐదు నెలల అదనపు ప్రయోజనాన్ని పొందవచ్చు.

కొత్త కస్టమర్లకు కూడా ప్రత్యేక ఆఫర్
ఇప్పటివరకు జియో హోమ్ వైఫై కనెక్షన్ తీసుకోని వారికి కూడా కంపెనీ మరో ఆఫర్ అందిస్తోంది. కొత్తగా కనెక్షన్ తీసుకునే కస్టమర్లు రెండు నెలల ప్లాన్ తీసుకుంటే మరో నెల పాటు అదనంగా ఉచితంగా పొందవచ్చు. అంటే రెండు ప్లాన్‌తో మొత్తం మూడు నెలలు ఇంటర్నెట్ నెలల సేవలు అందుతాయి. ఈ ఆఫర్‌లో 100Mbps వేగంతో ఇంటర్నెట్ అందించే ప్లాన్ కూడా ఉంది. దీని ధర రూ.2,122గా పేర్కొనబడింది.

జియో హోమ్‌లో ఇంటర్నెట్‌తో పాటు వినోదం కూడా
జియో హోమ్‌ను కేవలం వైఫై కనెక్షన్‌గానే కాకుండా ఇంటి వినోద అవసరాలకు ఉపయోగపడే సేవగా కంపెనీ అందిస్తోంది. ఇంటర్నెట్‌తో పాటు లైవ్ టీవీ ఛానళ్లు, ఓటీటీ యాప్స్ వంటి సౌకర్యాలు కూడా ఇందులో లభిస్తున్నాయి. దీనితో ఇంట్లోని సభ్యులు మీకు నచ్చిన కార్యక్రమాలు, సినిమాలు, ఇతర ఎంటర్టైన్మెంట్ కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా ఎక్కువగా ఇంటర్నెట్ వాడే కుటుంబాలకు ఈ తరహా దీర్ఘకాలిక రీఛార్జ్ ఆఫర్లు ఉపయోగపడతాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird