Home సినిమా టాలీవుడ్‌లో విషాదం: ప్రముఖ నిర్మాత చలసాని వెంకటేశ్వరరావు కన్నుమూత! – Andhra Waves

టాలీవుడ్‌లో విషాదం: ప్రముఖ నిర్మాత చలసాని వెంకటేశ్వరరావు కన్నుమూత! – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


తెలుగు చిత్ర పరిశ్రమలో మరోసారి విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. ప్రముఖ సీనియర్ సినీ నిర్మాత, ‘జగపతి మూవీ క్రియేషన్స్’ అధినేత జె.వి.ఆర్. చలసాని వెంకటేశ్వరరావు కన్నుమూశారు. ఒక సాధారణ హాల్ బుకింగ్ క్లార్క్‌గా తన జీవితాన్ని స్టార్ట్ చేసి సినిమా రంగంపై మక్కువతో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా ఎదిగారు.

‘జగపతి మూవీ క్రియేషన్స్’ బ్యాన‌ర్ ని స్థాపించి తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో వినోద్ కుమార్ హీరోగా వచ్చిన యాక్షన్ డ్రామా `నేటి దౌర్జన్యం` , బి. విఠలాచార్య దర్శకత్వంలో భక్తిరస చిత్రం `కరుణించిన కనకదుర్గ` (1992) వంటి చిత్రాలు ఆయన నిర్మాణ ప్రతిభకి నిదర్శనంగా నిలిచాయి.ఆయ’న స్వీయ దర్శకత్వంలో వచ్చిన బాలల చిత్రం దాన’వీరశూరక’ర్ణ’ 2015లో పెద్ద విజయం. ఎన్టీఆర్ మనవడు నందమూరి జానకి రామ్ కుమారుడు మాస్టర్ ఎన్టీఆర్ ని శ్రీకృష్ణుడిగా కనిపించాడు. ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా.. 2015 సంవత్సరానికి గాను `ఉత్తమ బాలల చిత్రం`గా నంది అవార్డును అందుకోవడం విశేషం.

ప్రస్తుతం తన సొంత ఊరు ‘విజయవాడ’లో వృద్ధాశ్రమాన్ని నడుపుతూ పలు సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. సినిమా అభివృద్ధి కోసం కూడా తన వంతు పాటు పడ్డాడు.ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే సినిమాని ప్రాణంగా భావించే వాళ్ళు చనిపోతే మళ్ళీ సినిమాని తన ఆయువుగా మార్చుకోవడానికి జన్మిస్తారని. మరి ఈ పాటికే ఎక్కడో పుట్టిన వెంకటేశ్వరరావు గారు తన పసి చిరు ఆలోచనలతో సినిమాని మళ్ళీ ఎలా ఏలాలి తన ప్రతిభ ఎలా చాటాలో అనే పనిలో ఉంటారు.ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ గా కూడా రికార్డు ఉంది మరి.

[Jvr Chalasani Venkateswara Rao Passes Away, JVR Chalasani Venkateswara Rao, Tollywood producer passes away, Jagapathi Movie Creations, Tollywood, Tollywood News, Telugu News, TeluguCinema]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird