Home Latest News సమాజ శ్రేయస్సే వ్యాపార పరమార్ధం: రతన్ టాటా బాటలోనే నోయెల్ టాటా.. పేదల వైద్యం కోసం 50 మంది ఆస్పత్రులు.! | నోయెల్ టాటా టేక్ డోర్వర్డ్ రతన్ టాటా లెగసీ | టాటా ట్రస్ట్ హాస్పిటల్స్ | టాటా హెల్త్‌కేర్ ఇనిషియేటివ్ | సరసమైన హెల్త్‌కేర్ ఇండియా | వ్యాపారం | ప్రయోజనం | సమాజం | క్షేమం – Andhra Waves

సమాజ శ్రేయస్సే వ్యాపార పరమార్ధం: రతన్ టాటా బాటలోనే నోయెల్ టాటా.. పేదల వైద్యం కోసం 50 మంది ఆస్పత్రులు.! | నోయెల్ టాటా టేక్ డోర్వర్డ్ రతన్ టాటా లెగసీ | టాటా ట్రస్ట్ హాస్పిటల్స్ | టాటా హెల్త్‌కేర్ ఇనిషియేటివ్ | సరసమైన హెల్త్‌కేర్ ఇండియా | వ్యాపారం | ప్రయోజనం | సమాజం | క్షేమం – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


రతన్ టాటా సేవా వారస్వాన్ని నోయెల్ టాటా ముందుకు తీసుకువెళుతున్నారు. భారత వ్యాపార సామ్రాజ్యంలోనే కాకుండా ప్రజా సంక్షేమ రంగంలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన రతన్ టాటా వారస్వాన్ని టాటా ట్రస్ట్ చైర్మన్ నోయెల్ టాటా కొనసాగిస్తున్నారు. ఆ దిశగా ఓ చరిత్రాత్మక ఘట్టానికి ఆయన శ్రీకారం చుట్టారు. దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా ఆశయాలను, ఆయన వదిలివెళ్లిన సేవా వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా నోయెల్ టాటా దేశంలోని సామాన్యులకు, నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి బృహత్తర శ్రీకారం చుట్టారు.

అందులో భాగంగా దేశ వ్యాప్తంగా 40 నుండి 50 ఆసుపత్రులను నిర్మించడానికి రూపొందించారు. ప్రైవేటు వైద్యం అత్యంత ప్రియమైన ప్రస్తుత పరిస్ధితుల్లో.. నోయెల్ టాటా రూపొందించి అమలు చేయనున్న ఈ ప్రాజెక్ట్ ఇండయన్ హెల్త్ కేర్ సెక్టార్‌లో విప్లవాత్మక మార్పులకు బాటలు వేయడంలో సందేహం లేదు.

ఈ ప్రతిష్టాత్మక హెల్త్‌కేర్ విస్తరణ ప్రాజెక్ట్‌లో భాగంగా దేశంలో వైద్య సదుపాయాలు సరిగా లేని ప్రాంతాలు, గ్రామీణ సరిహద్దులు, మధ్యతరగతి ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అనేది కేవలం ధనికులకు మాత్రమే పరిమితం కాకూడదని, ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడికి మెరుగైన చికిత్స అందాలన్న సదాశయంతో నోయెల్ టాటా ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. ఈ ఆసుపత్రుల నిర్మాణం అత్యాధునిక వైద్య పరికరాలు, అర్హత కలిగిన ప్రముఖ వైద్యులు, సకల సౌకర్యాలతో కూడిన అత్యుత్తమ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది సమాజంలో అల్పాదాయ వర్గాల కుటుంబాల ఆరోగ్య సంరక్షణలో గేమ్ చెంజర్ గా మారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా పేదలకు నిరంతరాయంగా, ఎఫెక్టివ్ గా సేవలందించేందుకు నోయెల్ టాటా ఒక వినూత్నమైన ఆర్థిక నమూనాను ప్రవేశపెట్టారు. ఈ విధానం ప్రకారం, ఆర్థిక స్థోమత ఉన్న రోగులకు చెల్లించే సేవా రుసుముల ద్వారా వచ్చే ఆదాయాన్ని నిరుపేద రోగులు, స్వల్ప రుసుము వైద్యానికి ఉచితంగా వినియోగిస్తారు. అంటే ఆసుపత్రికి వచ్చే సంపన్నులు పొందే వైద్య సేవల ద్వారా లభించే ఆదాయం.. పేద రోగులకు అందించే ఉచిత చికిత్సలకు నిధులుగా మారతాయి. ఈ సెల్ఫ్ సస్టెయినింగ్ మోడల్ ఫండ్స్ వల్ల ప్రభుత్వ నిధులు, విరాళాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా నిరాఘాటంగా పేదలకు నాణ్యమైన వైద్య సేవలను నిరంతరాయంగా అందించడానికి వీలవుతుంది.

ముంబైలోని ప్రసిద్ధ టాటా మెమోరియల్ హాస్పిటల్ ఇప్పటికే క్యాన్సర్ బాధితులకు అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలను అందిస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ స్ఫూర్తితో, అదే తరహా సేవా దృక్పథాన్ని సాధారణ ఆసుపత్రుల అభివృద్ధి కూడా వర్తింపజేయాలన్నదే టాటా నోయెల్ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కొత్తగా నిర్మించే 40 నంచి 50 ఆసుపత్రుల్లో కేవలం సాధారణ వ్యాధులకు చికిత్స అందించడమే కాకుండా, అత్యవసర వైద్యం, మాతాశిశు సంరక్షణ, ఆపరేషన్లు, రోగనిర్ధారణ సేవలకు ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నారు. దీని వల్ల పేదరోగులు వైద్య చికిత్స కోసం నగరాలకు వెళ్లే అవసరం ఉండదు. స్థానికంగానే వైద్య స్థాయి వైద్యం అందుతుంది.

రతన్ టాటా తన జీవితకాలంలో వ్యాపార విస్తరణతో పాటు సామాజిక సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఆయన మరణం తర్వాత టాటా ట్రస్ట్ సారథ్యాన్ని స్వీకరించిన నోయెల్ టాటా, రతన్ టాటా ఆశయాలను కొనసాగించడమే కాకుండా మరింత విస్తరిస్తూ ముందుకు సాగుతున్నారు. . టాటా గ్రూప్ లాభాల్లో అత్యధిక ట్రస్ట్‌ల ద్వారా ప్రజా సంక్షేమ కార్యక్రమాలకే వెచ్చిస్తున్నారు. . ఈ అవకాశం నోయెల్ టాటా తీసుకున్న ఈ తాజా నిర్ణయం సమాజ శ్రేయస్సే వ్యాపార పరమార్థం అనే సూత్రానికి అద్దం పడుతోంది.

వేగంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ వైద్య మౌలిక సదుపాయాలు లేవన్నది కాదనలేని వాస్తవం. అదే సమయంలో ప్రైవేటు ఆసుపత్రులలో వైద్య ఖర్చులు అసాధారణంగా పెరిగాయి. సామాన్య, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చికిత్స అన్నది తట్టుకోలేని ఆర్థిక సంక్షోభంగా మారింది. వైద్య ఖర్చుల కారణంగా అనేక కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నపరిస్థితి. ఇటువంటి తరుణంగా టాటా నోయెల్.. పేద, దిగువ మధ్య తరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవను ఉచితంగా అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ పేదల పాలిట సంజీవని అనడంలో సందేహం లేదు.

ఈ ఆసుపత్రుల నిర్మాణాన్ని వివిధ దశలలో టాటా ట్రస్ట్ ప్రారంభించనుంది. తొలి దశలో అత్యంత వెనుకబడిన జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించనున్నారు. ఆధునిక డిజిటల్ హెల్త్‌కేర్ సాంకేతికతలు, టెలిమెడిసిన్, రోబోటిక్ వైద్య పరికరాలను కూడా ఈ ఆసుపత్రుల్లో వినియోగించేలా ప్రణాళికలు రూపొందించారు. రతన్ టాటా సేవా మార్గంలో ముందుకు సాగుతూ.. నోయెల్ టాటా తీసుకున్న ఈ నిర్ణయం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందనడంలో సందేహం లేదు.

[Noel Tata Take dorward Ratan Tata Legacy, Tata Trusts Hospitals, Tata Healthcare Initiative, Affordable Healthcare India, Business, Purpose, Society, Wellbeing, Telugu One]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird