Home Latest News గరల్స్ హాస్టల్ ముసుగులో ఫెర్టిలిటీ సెంటర్: గుట్టురట్టు చేసిన పోలీసులు.! | హైదరాబాద్ ఫెర్టిలిటీ రాకెట్ | బేగంపేట బాలికల హాస్టల్‌పై దాడి | అక్రమ సరోగసీ గుడ్డు విరాళం రాకెట్ | మల్కాజిగిరి SOT పోలీసుల ఆపరేషన్ – Andhra Waves

గరల్స్ హాస్టల్ ముసుగులో ఫెర్టిలిటీ సెంటర్: గుట్టురట్టు చేసిన పోలీసులు.! | హైదరాబాద్ ఫెర్టిలిటీ రాకెట్ | బేగంపేట బాలికల హాస్టల్‌పై దాడి | అక్రమ సరోగసీ గుడ్డు విరాళం రాకెట్ | మల్కాజిగిరి SOT పోలీసుల ఆపరేషన్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌కే వ్యవహారం మరిచిపోక ముందే హైదరాబాద్‌లో మరో అక్రమ ఫెర్టిలిటీ దందా వెలుగులోకి వచ్చింది. .గరల్స్ హాస్టల్ ముసుగులో అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. పక్కాగా అందిన సమాచారంతో హైదరాబాద్ ప్రకాశ్ నగర్ లో అమినీత గరల్స్ హాస్టల్ పై దాడి చేయడంతో అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ గుట్టు రట్టైంది. పోలీసులు, మల్కాజ్‌గిరి స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) సంయుక్తంగా ఈ ఆకస్మిక దాడిలో వెలుగు చూసిన అంశాలు అధికారులను విస్మయానికి గురి చేశాయి.

గత ఏడాది కాలంగా ఈ ప్రాంగణాన్ని మహిళల వసతి గృహంగా మభ్యపెడుతూ ఈ అక్రమ కార్యకలాపాల నిర్వాహకులు కొనసాగుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా వంటి ఇతర రాష్ట్రాల నుంచి ఆర్థికంగా వెనుకబడిన యువతను వివిధ కారణాల రీత్యా ఇక్కడికి రప్పించి, వారి నుంచి అండాలను అక్రమంగా సేకరిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

కేవలం మహిళా అందాల సేకరణ మాత్రమే కాకుండా, కొంతమంది పురుషుల నుంచి వీర్య నమూనాలను కూడా సేకరించి వివిధ ఐవీఎఫ్ కేంద్రాలకు భారీ మొత్తాలకు విక్రయిస్తున్నట్లు ఈ తనిఖీల్లో బయటపడింది. నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని ఈ దందా నడుపుతున్నట్లు తెలిసింది.

ఈ సందర్భంగా బి, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 10 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని సురక్షిత తరలించి విచారిస్తున్నారు. ఈ దందాతో సంబంధం ఉన్న నిర్వాహకుల కదలికలపై అధికారులు నిఘా పెంచారు.. ఈ అక్రమ నెట్‌వర్క్ వెనుక ఏయే సంతాన సాఫల్య కేంద్రాలున్నాయి? దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగుతోంది.


[Hyderabad Fertility Racket, Begumpet Girls Hostel Raid, Illegal Surrogacy Egg donation racket, Malkajgiri SOT police Operation, Telugu One]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird