Home Uncategorized 108, 109 వార్డుల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి

108, 109 వార్డుల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి

by andhra andhrawave
0 comments

అనకాపల్లి అభివృద్ధికి ప్రజలు సహకరించాలి: ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ

మహిళా సాధికారత, పట్టణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట

అనకాపల్లి: జీవీఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 108, 109వ వార్డుల కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా 108, 109వ వార్డులకు చెందిన కుటుంబ సభ్యులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కొణతాల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ పాలన సాగిస్తోందన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ, తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందించడం వంటి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని వివరించారు.

మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలనే లక్ష్యంతో మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పట్టణ అభివృద్ధిలో మహిళా ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

అనకాపల్లి జిల్లాలో భారీ పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని, వీటి ద్వారా స్థానిక యువతకు విస్తృతంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనకాపల్లి పట్టణంలో సుమారు రూ.100 కోట్ల అభివృద్ధి పనులు మంజూరయ్యాయని తెలిపారు. ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి కనెక్షన్లు, మెరుగైన రహదారులు, వీధి దీపాలు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.

ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. స్థానిక సంస్థల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా, సమర్థవంతంగా అమలు చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనకాపల్లికి పూర్వ వైభవం తీసుకురావాలంటే ప్రజలందరూ కూటమి అభ్యర్థులకు అండగా నిలిచి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కొణతాల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో మాజీ శాసనమండలి సభ్యులు బుద్ధ నాగ జగదీష్, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird