Home Uncategorized కూటమి అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత

అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

కూటమి అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత

అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

by andhra andhrawave
0 comments

అనకాపల్లి: అనకాపల్లి నియోజకవర్గ పరిధిలోని అనకాపల్లి, కశింకోట మండలాల్లో కూటమి బలపరిచిన జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణ బీ-ఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

2014–19 మధ్య కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి మాదిరిగానే, ప్రస్తుత ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటే గ్రామాలు, మండలాల్లో మరింత అభివృద్ధి సాధించవచ్చని పీలా గోవింద సత్యనారాయణ పేర్కొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు.

కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి, అభ్యర్థులకు మద్దతు కూడగట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు కర్రీ బాబి, ఆడారి గోవిందరావు, రాపేటి రాంకుమార్, బోసుబాబు, కశింకోట మండల నాయకులు ఉగ్గిన రమణమూర్తి, కాయల మురళి, వేగి గోపి, సిదిరెడ్డి శ్రీను, కాండ్రేగుల సతీష్, ఉల్లింగల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణ పిలుపు

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird