కూటమి అభ్యర్థి పలకా యశోదను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి
అనకాపల్లి: జీవీఎంసీ 111వ వార్డులో కూటమి అభ్యర్థి పలకా యశోద రవి విజయాన్ని కాంక్షిస్తూ మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ విస్తృత ప్రచారం నిర్వహించారు. విజయరామరాజుపేట వీధులు, పరిసర ప్రాంతాల్లో అభ్యర్థితో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
ప్రచారంలో భాగంగా స్థానికులతో మమేకమైన కొణతాల రామకృష్ణ, ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి విజయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. 111వ వార్డులో కూటమి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
ఈ కార్యక్రమంలో 111వ వార్డుకు చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

