ఇండియన్ 3: అప్పట్లో ఇండియన్ (భారతీయుడు) సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేసింది.. ఆ తర్వాత ఈ సినిమాకు సీక్వల్ గా వచ్చిన ఇండియన్ 2 కనీసం ప్రింట్ ఖర్చులు కూడా రాలేదు.. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు.. ఇండియన్ 3 సీన్స్ తీశారు. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మించింది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను ఇటీవల దర్శకుడు శంకర్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన పనులు ఇప్పుడు ఊపందుకుంటాయి. […]
భారతీయ 3: అప్పట్లో ఇండియన్ (భారతీయుడు) సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేసింది.. ఆ తర్వాత ఈ సినిమాకు సీక్వల్ గా వచ్చిన ఇండియన్ 2 కనీసం ప్రింట్ ఖర్చులు కూడా రాలేదు.. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే.. ఇండియన్ 3 సీన్స్ తీశారు. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మించింది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను ఇటీవల దర్శకుడు శంకర్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.
ఈ సినిమాకు సంబంధించిన పనులు ఇప్పుడు ఊపందుకుంటాయి. ఈ సినిమా నిర్మాణం జోరుగా సాగుతోంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమాను జనవరిలో విడుదల చేస్తారు. అది కూడా సంక్రాంతి కానుకగా.. ఇతర రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు జరుగుతున్నాయి. తమిళం వరకు పెద్దగా ఇబ్బంది లేదు. ఎందుకంటే కమల్ హాసన్ కు అక్కడ మార్కెట్ ఉంది. లైకా ప్రొడక్షన్ సంస్థకు ఓన్ డిస్ట్రిషన్ వ్యవస్థ ఉంది. పెద్ద థియేటర్లు కూడా ఉన్నాయి. కానీ, తెలుగు రాష్ట్రాల్లోనే సమస్య వస్తోంది.
ఇండియన్ 2 వల్ల చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఆరిపోయారు. తెలుగులో కమల్ మార్కెట్ కూడా అంతంత మాత్రం. అలాంటప్పుడు తెలుగులో ఈ సినిమా విడుదల చేయడానికి ఎవరు వస్తారు అనే ప్రశ్న వ్యక్తం అవుతుంది. అయితే ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ ముందు ఈ ప్రతిపాదన ఉంచాలని. ఆయన ఇంకా పచ్చ జెండా ఊపలేదు. ఒకవేళ ఆయన గనుక లైన్ క్లియర్ చేస్తే.. సంక్రాంతికి విడుదల తేదీతో పోస్టర్ రూపొందించేందుకు లైకా సంస్థ సిద్ధంగా ఉంది. 2 బాక్సాఫీస్ వద్ద విఫలమైన నేపథ్యంలో ఇండియన్.. ఈసారి ఎటువంటి ఫ్యాన్సీ రేట్లు కనిపించడం లేదు. ఒకరకంగా చెప్పాలంటే రేట్లపై చర్చలు కూడా సాగడం లేదు. జస్ట్ నార్మల్ ప్రైస్ కే భారతీయుడు 3 తెర ముందుకు వస్తాడు. ప్రచారం కూడా అంతంత మాత్రంగానే చేస్తారు.
ఇక ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ కొనసాగుతోంది. గ్రాఫిక్స్ విషయంలో రాజీ పడకూడదని లైకా ప్రొడక్షన్స్ ఇప్పటికే నిర్ణయించింది. దర్శకుడు శంకర్ కు కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. అయితే ఈ సినిమాకి ఒక 25 రోజులపాటు షూటింగ్ చేస్తే బాగుంటుంది.. కొంతమేర ప్యాచ్ వర్క్ కూడా చేస్తే బాగుంటుందని శంకర్ లైకా ప్రొడక్షన్స్ ముందు ప్రతిపాదన ఉంచితే.. దానికి ఆ సంస్థ ఒప్పుకోలేదు. కేవలం నాలుగు రోజుల ప్యాచ్ వర్క్ చేయడానికి మాత్రమే నిర్మాతలు ఒప్పుకున్నారు. మొత్తంగా చూస్తే ఇండియన్ 2 షూటింగ్ జరుగుతున్నప్పుడు తీసిన పుటేజి ద్వారా ఇండియన్ 3 సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇండియన్ 2 ఒక్క స్క్రాప్.. ఈ సినిమా షూటింగ్ టైంలోనే తీశారు అంటే.. క్వాలిటీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ సినిమా సంక్రాంతి వస్తే థియేటర్లు దొరుకుతాయా.. ఆ అవకాశం ఉందా.. ఈ ప్రశ్నకు సమాధానం దగ్గుబాటి సురేష్ చేతిలోనే ఉంది.
