Home సినిమా కొడితే ఇలాంటి జాబ్ కొట్టాలి.. నెలకు రూ. 1.42 లక్షల జీతం.. అస్సలు మిస్ చేసుకోకండి – Andhra Waves

కొడితే ఇలాంటి జాబ్ కొట్టాలి.. నెలకు రూ. 1.42 లక్షల జీతం.. అస్సలు మిస్ చేసుకోకండి – Andhra Waves

by andhra andhrawave
0 comments
కొడితే ఇలాంటి జాబ్ కొట్టాలి.. నెలకు రూ. 1.42 లక్షల జీతం.. అస్సలు మిస్ చేసుకోకండి


మనదేశంలో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తారు. అది కూడా భారీ ప్యాకేజీ ఉండే ఉద్యోగాలు సాధించాలని కలలు కంటారు. మీరు కూడా ఇదే ఆలోచనలో ఉంటే ఇది మీ కోసమే. ఇప్పుడు చెప్పబోయే ఉద్యోగాల్లో జాబ్ కొడితే.. నెలకు రూ.1.42 వేల వరకు జీతం పొందవచ్చు. ఇంతకు ఈ ఉద్యోగాలు ఏ సంస్థలో అంటే..

భారతీయ అంతరిక్ష పరిశోధనా (ISRO) సంస్థ తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇస్రోలో కొలువు సాధించాలంటే అర్హులైన భారతీయ పౌరుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నియామకాల ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ ‘బి’, సైంటిఫిక్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) తో పాటు వివిధ విభాగాల్లో మొత్తం 97 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2026 నవంబరు 9వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు – విద్యార్హతలు

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న వివిధ రకాల పోస్టుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

  • టెక్నికల్ అసిస్టెంట్: 07 పోస్టులు
  • టెక్నీషియన్ ‘బి’: 16 పోస్టులు
  • సైంటిఫిక్ అసిస్టెంట్: 02 పోస్టులు
  • లైబ్రీ అసిస్టెంట్ ‘ఎ’: 03 పోస్టులు
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): 16 పోస్టులు
  • నర్స్ ‘బి’: 03 పోస్టులు
  • ఇతర ఖాళీలు: 35 పోస్టులు

విద్యార్హత:

పోస్టును పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ, డిగ్రీ, పీజీ లేదా ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి, వేతనం, ఫీజు వివరాలు

  • వయోపరిమితి: దరఖాస్తుదారుల వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది (ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు; ఓబీసీలకు 3 ఏళ్లు సడలింపు).
  • జీతం: ఎంపికైన అభ్యర్థులకు పోస్టు స్థాయిని బట్టి నెలకు రూ. 18,000 రూ. 1,42,400 వరకు ప్రారంభ వేతనంతో పాటు ఇతర అలవెన్సులు లభిస్తాయి.

దరఖాస్తు రుసుము:

  • పోస్ట్ కోడ్ 07 నుండి 15 వరకు రూ. 750,
  • పోస్ట్ కోడ్ 16 నుండి 30 వరకు రూ. 500 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
  • రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ఫీజు రీఫండ్ వర్తిస్తుంది.

ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ

అభ్యర్థులు పోస్టుల ఆధారంగా రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, శారీరక దారుఢ్య పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.

ఇది కూడా చదవండి : రైల్వేలో 5,236 ఉద్యోగాలు.. ఇంటర్ పాస్ అయితే చాలు.. అస్సలు మిస్ చేసుకోకండి.

దరఖాస్తు చేసుకునే విధానం:

  • SDSC SHAR అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • అధికారిక రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను పరిశీలించి ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్‌ను నింపాలి.
  • అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, నిర్ణీత ఫీజు చెల్లించి సబ్‌మిట్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు:

  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 19 అక్టోబరు 2026
  • దరఖాస్తులకు చివరి తేదీ: 09 నవంబరు 2026 (రాత్రి 11.59 గంటల వరకు).

మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ చూడవచ్చు.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird