ఓటీటీలో హాలీవుడ్ సినిమాలు చూసేవారికి ఓ ఇంట్రెస్టింగ్ మూవీ వచ్చింది . ప్రముఖ దర్శకుడు వెస్ అండర్సన్ తెరకెక్కించిన మూవీ ఇది . క్రైమ్, కామెడీ, డ్రామా అంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బడా వ్యాపారవేత్త, అతని సన్యాసిని కూతురు, చుట్టూ అల్లుకున్న కుట్రలు.. ఇలా భిన్నమైన కథాంశంతో ఈ సినిమా సాగుతుంది. దీని గురించి పూర్తి వివరాలను చూడండి.
ఈ సినిమా కథ విషయానికొస్తే… యూరప్‌లో అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో ఒకడైన జా-జా కోర్డా చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అతను ఎన్నో వ్యాపార ప్రణాళికలు వేసే తెలివైన వ్యక్తి. అయితే అతని జీవితంలో వరుసగా హత్యాయత్నాలు జరుగుతుంటాయి. ఆరోసారి కూడా ప్రాణాపాయం నుంచి బయటపడిన తర్వాత తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎవరికీ అప్పగించాలనే ప్రశ్న అతని ముందుకొస్తుంది.
దీంతో తనకు దూరంగా ఉంటున్న ఏకైక కూతురు లీసల్‌ను వారసురాలిగా నియమించాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఆమె సాధారణ యువతి కాదు.. సన్యాసిని. వ్యాపారం, డబ్బు, అధికారానికి దూరంగా ఉంటే ఆమెకు తండ్రి ప్రపంచంతో పెద్దగా సంబంధం ఉండదు. అలాంటి కూతురిని తన వ్యాపార వ్యవహారాల్లోకి తీసుకురావడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది.
జా-జా తన భారీ వ్యాపార ప్రాజెక్టును పూర్తి చేయడానికి, అతనికి వ్యతిరేకంగా శక్తివంతమైన వ్యాపారవేత్తలు, ఇతర శక్తుల కుట్రలు పన్నుతుంటాయి. విదేశీ ఉగ్రవాదులు, హంతకుల నుంచి కూడా ముప్పు ఎదురవుతుంది. ఈ ప్రమాదాల మధ్య తండ్రీకూతుళ్లు తమ లక్ష్యాన్ని చేరుకోగలిగారా? లీసల్ తన తండ్రి వ్యాపారాన్ని ప్రపంచాన్ని అర్థం చేసుకోగలిగిందా? వారి మధ్య దూరం తగ్గిందా? అనేదే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.ఈ సినిమా పేరు ది ఫోనీషియన్ స్కీమ్. ప్రస్తుతం ఇది జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి.
మరిన్ని ఓటిటి అప్‌డేట్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

