Table of Contents
దేశవ్యాప్తంగా దసరా పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. విజయదశమి రోజున కొత్త పనులు ప్రారంభించడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం శుభప్రదమని చాలామంది నమ్ముతారు. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డు విజేత, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ దసరా పండుగ సందర్భంగా కొత్త కారును కొనుగోలు చేశాడు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
దసరా సందర్భంగా కొత్త కారు
రాహుల్ సిప్లిగంజ్ తన భార్య హరిణ్య రెడ్డితో కలిసి కొత్త కారు ముందు దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దుర్గామాత ఆశీస్సులతో ఈ ప్రత్యేకమైన కొత్త కారును కొనుగోలు చేసినట్లు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటిని చూసిన అభిమానులు, నెటిజన్లు రాహుల్ దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు.
రూ.70 లక్షల విలువైన టెస్లా కారు
రాహుల్ సిప్లిగంజ్ కొనుగోలు చేసిన కొత్త కారుస్లా అని, దాని ధర సుమారు రూ.70 లక్షలు ఉంటుందని సమాచారం. అయితే కారు మోడల్, వేరియంట్‌ను బట్టి ధరలో మార్పులు ఉండవచ్చు. ఇప్పటికే రాహుల్ రేజీలో మెర్సిడెస్ బెంజ్, వోల్వో లగ్జరీ కార్లు వంటి గ్యారీలు ఉన్నాయి. తాజాగా టెస్లా కారు కూడా ఆయన కార్ల జాబితాలో చేరింది.

