Home ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: కార్యకర్తను చంపడమే అర్హత.. అలాంటిది – Andhra Waves

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: కార్యకర్తను చంపడమే అర్హత.. అలాంటిది – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


YS Jagan Mohan Reddy: జగన్ చేసే రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక దళిత యువకుడిని చంపిన వ్యక్తికి సపోర్ట్ చేస్తాడు. పైగా ఆయన ఎమ్మెల్సీగా కొనసాగడానికి అండదండలు అందజేస్తాడు. ఎన్ని రకాలుగా విమర్శలు వచ్చినప్పటికీ.. కోర్టులు ఎన్ని రకాలుగా మొట్టికాయలు వేసినప్పటికీ జగన్ తన ధోరణి మార్చుకోడు. 2024 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. హంతకులకు.. రౌడీ షీటర్లకు.. మత్తు పదార్థాలు అమ్మేవాళ్లకు జగన్ సపోర్ట్ గా ఉంటాడని టీడీపీ నేతలు ఆరోపిస్తారు. పైగా అలాంటి […]

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: జగన్ చేసే రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక దళిత యువకుడిని చంపిన వ్యక్తికి సపోర్ట్ చేస్తాడు. పైగా ఆయన ఎమ్మెల్సీగా కొనసాగడానికి అండదండలు అందజేస్తాడు. ఎన్ని రకాలుగా విమర్శలు వచ్చినప్పటికీ.. కోర్టులు ఎన్ని రకాలుగా మొట్టికాయలు వేసినప్పటికీ జగన్ తన ధోరణి మార్చుకోడు. 2024 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. హంతకులకు.. రౌడీ షీటర్లకు.. మత్తు పదార్థాలు అమ్మేవాళ్లకు జగన్ సపోర్ట్ గా ఉంటాడని టీడీపీ నేతలు ఆరోపిస్తారు. పైగా అలాంటి వాళ్లను పరామర్శిస్తూ.. హత్య రాజకీయాలలో కొత్త బెంచ్ మార్క్ సృష్టిస్తూ ఉంటాడని టిడిపి నేతలు విమర్శిస్తారు.

ఆ విమర్శలకు తగ్గట్టుగానే జగన్ అడుగులు ఉంటాయి. తాజాగా స్థానిక ఎన్నికల్లో భాగంగా వైసిపి కడప మేయర్ అభ్యర్థిగా బండి దీప్తిరెడ్డిని జగన్ ప్రకటించారు. పులివెందుల మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా వైయస్ ప్రమీలారెడ్డిని ప్రకటించి విమర్శలకు కారణమైన జగన్.. దీప్తి రెడ్డి విషయంలో మరింతగా విమర్శలకు గురవుతున్నారు. జగన్ చేసిన ప్రకటనతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

బండి దీప్తి రెడ్డి ఎవరు అని ఆరా తీస్తే.. ఆమె మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి భార్య. నిత్యానంద రెడ్డి మామూలు వ్యక్తి కాదు. ఈయన దస్తగిరి అనే వైసీపీ కార్యకర్తను హత్య చేశారు. కొద్దిరోజుల పాటు జైల్లో కూడా ఉన్నారు. పెద్ద దస్తగిరి హత్యకు గురైన రోజున మత్తు పదార్థాల ముఠాల ఆధిపత్యం అన్నట్టుగా వైసిపి.. సాక్షి మీడియా ప్రచారం చేసింది. సాక్షి మీడియా దీని వెనక పెద్ద పరిశోధనాత్మక కథనం కూడా రాసింది. ఆ కథనం వెనుక ఉన్న అసలు అంతరార్థం ఏమిటో తర్వాత అర్థమైంది.

వివేకానంద రెడ్డి కేసును ఎలాగైతే గుండెపోటు అని ప్రచారం చేశారో.. పెద్ద దస్తగిరి కేసును కూడా మళ్ళించే ప్రయత్నాలు చేశారు. పెద్ద దస్తగిరి హత్య వెనక అనేక రకాల కారణాలు ఉన్నాయి. పెద్ద దస్తగిరి పేరు మీద భారీగా ఆస్తులు ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 500 కోట్ల వరకు ఉంటుంది. ఆ ఆస్తులు మొత్తం బినామీ కావడంతో.. అందుకే హత్య చేసినట్లు సమాచారం. ఈ హత్య కేసులో నిత్యానంద రెడ్డిని ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. హత్య తర్వాత నిత్యానంద రెడ్డి పారిపోయారు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయారు. అయితే ఆ 500 కోట్ల బినామీ ఆస్తులు ఎవరివి.. అనే దాని గురించి పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

బినామీ ఆస్తుల కోసమే నిత్యానంద రెడ్డి పెద్ద దస్తగిరి అని హత్య చేసి జైలుకు పోయారని కడపలో ప్రచారం జరుగుతుంది. అయితే ఆ కుటుంబానికి న్యాయం చేస్తే మేయర్ సీటు ఇస్తున్నట్టు సమాచారం. సొంత పార్టీ కార్యకర్తను హత్య చేయడం బెంచ్ మార్క్. అటువంటి వాళ్లకు మేయర్ పీఠం ఇవ్వడం సమకాలీన హత్య రాజకీయాలు ఎంత క్రూరంగా ఉంటాయో చెప్పే సింహాలకు మార్పు అని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు.. ఇప్పటికే కడపలో టిడిపి గాలి గట్టిగా వీస్తోంది. గతంలో మహానాడు జరిగింది. 2024 ఎన్నికల్లో రెడ్డప్ప గారి మాధవి ఇక్కడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జెడ్పిటిసి ఎన్నికల్లో కూడా జై కేతనం ఎగురేశారు. ఇప్పుడు మేయర్ పీఠం పెద్ద విషయం కాదని.. బౌన్సర్లతో పులివెందులలో ప్రమీలా రెడ్డి సాగిస్తున్న ప్రచారమే.. తమ విజయానికి సోపానమని టిడిపి నేతలు చెబుతున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird