సినిమాల్లో లవ్ స్టోరీలు చూసి ఎంజాయ్ చేయడానికే కాదు.. చాలామంది ఆలోచనలను కూడా మార్చేస్తుంటారు. మరీ ముఖ్యంగా వెండితెరపై షారుక్ ఖాన్ చేసిన రొమాన్స్ చూసి పెరిగిన వాళ్లకైతే, రియల్ లైఫ్‌లో ప్రేమ మీద ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా ఉండవు. సరిగ్గా ఇదే సూచన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఎంతో సరదాగా, ఓపెన్‌గా పంచుకుంది. తన జీవితంలో షారుక్ లాంటి వ్యక్తి లేకపోవడం మనసును తెగ బాధిస్తోందంటూ ఆమె అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఓ చిట్‌చాట్‌లో మాట్లాడిన మృణాల్.. “నా జీవితంలో షారుక్ ఖాన్ లాంటి వాడు లేడనే బాధ నన్ను పిండేస్తోంది. తెరపై రొమాన్స్ అంటే ఆయనే అంటూ సెట్ చేసిన లెవల్ ఎవరూ అందుకోలేరు. నాకు షారుక్ సర్ అంటే పిచ్చి ప్రేమ. బాలీవుడ్ లవ్ స్టోరీలు చూసి తన మనసులో ప్రేమపై అంచనాలు బాగా పెరిగిపోయాయని మురిసిపోతూ చెప్పింది. ఇక మృణాల్ సినిమాల విషయానికి వస్తే ఇటీవల క్రైమ్ థ్రిల్లర్ ‘పూజా మేరీ జాన్’ చిత్రంలో హ్యూమా ఖురేషి, విజయ్ రాజ్‌లతో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

