Home సినిమా దేవా మరణం: ‘బాషా’ బీజీఎం మూగబోయింది.. – Andhra Waves

దేవా మరణం: ‘బాషా’ బీజీఎం మూగబోయింది.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
దేవా మరణం: 'బాషా' బీజీఎం మూగబోయింది..


వెండితెరపై ‘సూపర్ స్టార్ రజినీ’ అని పడగానే వచ్చే సౌండ్‌కు థియేటర్‌లో ఈలలు, గోలతో రచ్చ లేచిపోవడాన్ని మనం చాలా సార్లు థియేటర్స్‌లో గమనించే ఉంటాం. ఆ అదిరిపోయే మ్యూజిక్ బిట్‌ను క్రియేట్ చేసిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ దేవా ఇక మన మధ్య లేరు. 75 ఏళ్ల వయసులో ఆయన శనివారం కన్నుమూశారు. ఈ రోజు సడన్‌గా ఆయనకు ఒంట్లో బాగోలే ప్రముఖ కుటుంబసభ్యులు చెన్నైలోని సూర్య ఆసుపత్రికి తీసుకెళ్లారు.

కానీ పరిస్థితి విషమించడంతో అక్కడే తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలియగానే సౌత్ సినిమా ఇండస్ట్రీ మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. రజినీ తెరపై కనిపిస్తే చాలు.. దేవా కొట్టిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గుర్తురావాల్సిందే. 1992లో వచ్చిన ‘అన్నామలై’ కోసం ఆయన కొట్టిన ఆ ఒక్క బిట్.. మూడు దశాబ్దాలుగా రజినీ ఇంట్రో అంటే ఇదే అన్నట్లుగా నిలిచిపోయింది. రీసెంట్‌గా వచ్చిన ‘జైలర్ 2’ వరకు కూడా ‘బాషా’ సినిమాలోని దేవా ఒరిజినల్ బీజీఎంనే వాడారంటే ఆయన వేసిన ముద్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

1950 నవంబర్ 20న పుట్టిన దేవనేసన్ చొక్కలింగం.. వెండితెరపై ‘దేవా’గా మారారు. మొదట్లో టీవీ ప్రోగ్రామ్స్‌కు పనిచేస్తూ, 1989లో ‘మనసుక్కేత మహారాస’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అప్పట్లో చెన్నై లోకల్ గల్లీల్లో వినిపించే ‘గానా’ పాటలను కమర్షియల్ సినిమాల్లోకి తీసుకొచ్చి సరికొత్త ట్రెండ్‌ను ప్రారంభించారు. ఆయన తమిళం, తెలుగుతో పాటు నాలుగు భాషల్లో ఏకంగా 400లకు పైగా సినిమాలకు అదిరిపోయే పాటలు ఇచ్చారు.

‘బాషా’, ‘అన్నామలై’తో పాటు అజిత్ నటించిన ‘ఆసై’, ‘వాలీ’, విజయ్ ‘ఖుషి’ లాంటి సూపర్ హిట్ సినిమాల్లోని పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒకచోట మోగుతూనే ఉన్నాయి. సంగీత దిగ్గజం ఎం.ఎస్.విశ్వనాథన్ స్వయంగా ఆయనకు ‘తేనిసై టెండ్రల్’ అని పేరు పెట్టగా, కలైమామణి లాంటి ఎన్నో పెద్ద అవార్డులు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. తన అదిరిపోయే బీట్స్‌తో కోట్లాది మందిని ఉర్రూతలూగించిన ఈ లెజెండరీ కంపోజర్ ఇక లేరనే వార్తా అభిమానులను, ముఖ్యంగా రజినీ ఫ్యాన్స్‌ను తీవ్ర విషాదంలో ముంచేసింది.

రచయిత అవతార్

గణేష్

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird