Home ఆంధ్రప్రదేశ్ విజయ్ తమిళనాడు సీఎం: పీట వేస్తే కూర్చోలేదు.. మర్యాదలు – Andhra Waves

విజయ్ తమిళనాడు సీఎం: పీట వేస్తే కూర్చోలేదు.. మర్యాదలు – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


విజయ్ తమిళనాడు సీఎం వచ్చారు: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తొలిసారిగా ఏపీ. కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు రెండు రాష్ట్రాల ప్రజల మీద ఉండాలని కోరుకున్నారు. తన పర్యటనలో విజయ్ సింప్లిసిటీని ప్రదర్శించారు. తమిళ సంప్రదాయం ప్రకారం పట్టుపంచ.. చొక్కా ధరించి వచ్చారు. అర్చకుల ఆశీర్వచనాలను స్వీకరించారు. చంద్రబాబు సాదరంగా ఆహ్వానం పలికితే.. వినమ్రంగా నమస్కరించారు. చంద్రబాబు పిలిస్తే విజయ్ రావడం.. విజయవాడ ఉత్సవంలో పాల్గొనడం.. ఇదంతా అధికారిక కార్యక్రమం. దుర్గమ్మను దర్శించుకున్న తర్వాత విజయ్ తో […]

విజయ్ తమిళనాడు సీఎం: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తొలిసారిగా ఏపీ వచ్చారు. కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు రెండు రాష్ట్రాల ప్రజల మీద ఉండాలని కోరుకున్నారు. తన పర్యటనలో విజయ్ సింప్లిసిటీని ప్రదర్శించారు. తమిళ సంప్రదాయం ప్రకారం పట్టుపంచ.. చొక్కా ధరించి వచ్చారు. అర్చకుల ఆశీర్వచనాలను స్వీకరించారు. చంద్రబాబు సాదరంగా ఆహ్వానం పలికితే.. వినమ్రంగా నమస్కరించారు. చంద్రబాబు పిలిస్తే విజయ్ రావడం.. విజయవాడ ఉత్సవంలో పాల్గొనడం.. ఇదంతా అధికారిక కార్యక్రమం.

దుర్గమ్మను దర్శించుకున్న తర్వాత విజయ్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఇది ఆన్ రికార్డు సమావేశమే. ఇందులో ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు.. ఇతర మంత్రులు.. అధికారులు ఉన్నారు. నిజానికి చాలా సేపు చర్చలు జరిగాయి. ఇంతకీ వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారు.. ఏం చర్చించుకున్నారు.. పొలిటికల్ పరంగా చంద్రబాబుకు తమిళనాడు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. గతంలో ఇండియా కూటమిలో ఉన్నప్పుడు అందరిని ఏకం చేయడానికి చంద్రబాబు ప్రయత్నం చేశారు. అప్పట్లో తమిళనాడు కూడా వెళ్లారు. స్టాలిన్ వంటి వారితో మాట్లాడారు. కానీ ఇప్పుడు పొలిటికల్ ఈక్వేషన్లు వేరు.. పైగా మోడీకి చంద్రబాబు ఇప్పుడు అత్యంత దగ్గరి వ్యక్తి. పైగా ఏపీ రాష్ట్ర ప్రయోజనాలు అత్యంత ముఖ్యమైనవి. అందుకే చంద్రబాబు ఇప్పుడున్న పార్టీని కాపాడుకుంటూ.. రాష్ట్ర ప్రయోజనాలను పర్యవేక్షించే బాధ్యతను భుజాలకు ఎత్తుకున్నారు.

అందువల్లే ఏపీలో కీలకమైన కృష్ణ డెల్టా మీద దృష్టిసారించారు. గోదావరి డెల్టాకు నీటి కరువు లేదు. పైగా గోదావరి ప్రాంతంలో నిత్యం నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్ల గోదావరి కృష్ణ వైపు పంపించడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే కావేరి గోదావరి అనుసంధానం అనే తెరమీద తీసుకొచ్చారు. అందుకే విజయ్ ని ఏపీకి పిలిపించారు. మాట్లాడారు. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తో తెలుగు గంగ ప్రాజెక్టు మీద విస్తృతంగా చర్చ జరిగింది. చెన్నై నగరానికి అందుతున్న సరఫరా మీద ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడారు. అయితే చెన్నై సమస్యకు విజయ్ చంద్రబాబును నిర్ణయించారు.

విజయ్ విజ్ఞప్తికి చంద్రబాబు నాయుడు సానుకూలంగానే స్పందించారు. ఇదే సమయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. తెలుగు గంగకు నీటి కేటాయింపులు.. ఇతర వ్యవహారాలను అధికారులతో చర్చించి.. తదుపరి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక ఇదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలలో జల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడానికి తాను సిద్ధంగా ఉన్నానని.. గోదావరి కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టాల్సిన అవసరాన్ని విజయ్ ముందు చంద్రబాబు ఉంచారు. ప్రతి ఏడాది వేలాది టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని.. కేంద్రం మీద ఉమ్మడిగా ఒత్తిడి తీసుకొస్తే.. దీనిని జాతీయ మిషన్ గా ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని చంద్రబాబు సూచించారు. దీనికి విజయ్ సానుకూలంగా స్పందించారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird