Home ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సీఎం విజయ్: జగన్ కోటరీ గట్టిగానే పనిచేసింది.. – Andhra Waves

తమిళనాడు సీఎం విజయ్: జగన్ కోటరీ గట్టిగానే పనిచేసింది.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


తమిళనాడు సీఎం విజయ్: వైయస్ జగన్మోహన్ రెడ్డి కజిన్ వైయస్ అనిల్ రెడ్డి. ఈయనకు తమిళనాడు రాజకీయాలు కొట్టినపిండి. పైగా ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కి అత్యంత దగ్గర వ్యక్తి. అనిల్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తారు విజయ్. ఇందులో ఏ అనుమానం లేదు. ఇటీవల డీఎంకే పార్టీ నేతలు అనిల్ రెడ్డిని ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు. ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. కీలకమైన సాక్షాలతో మొత్తం బయటపెట్టారు […]

తమిళనాడు సీఎం విజయ్: వైయస్ జగన్మోహన్ రెడ్డి కజిన్ వైయస్ అనిల్ రెడ్డి. ఈయనకు తమిళనాడు రాజకీయాలు కొట్టినపిండి. పైగా ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కి అత్యంత దగ్గర వ్యక్తి. అనిల్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తారు విజయ్. ఇందులో ఏ అనుమానం లేదు. ఇటీవల డీఎంకే పార్టీ నేతలు అనిల్ రెడ్డిని ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు. ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. కీలకమైన సాక్షాలతో మొత్తం బయటపెట్టారు డిఎంకే నేతలు. అయినప్పటికీ అనిల్ రెడ్డితో సంబంధాలను విజయ్ తెంపుకోవడానికి ఇష్టపడటం లేదు.

అవసరాలు మాత్రమే రాజకీయాల్లో ఉంటాయి. అనిల్ రెడ్డితో ఏం అవసరం ఉందో తెలియదు. కాకపోతే విజయ్ ఆయనతో సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. అనిల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి కజిన్. పైగా ఆమధ్య జగన్.. విజయ్ భేటీ కావడానికి అనిల్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. పైగా విజయ్ క్రిస్టియన్ మతాన్ని ఫాలో అవుతారు. పైగా ఏపీకి, తమిళనాడుకు సరిహద్దు ఉంది. రెండు రాష్ట్రాల రాజకీయాలలో అటు తెలుగువారు.. ఇటు తమిళం వారు వేలు పెడుతూనే ఉన్నారు. పైగా వ్యాపార సంబంధాలు దర్జాగా కొనసాగుతూనే ఉంటాయి. విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్.. ఆయన సిద్ధాంతాలను ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. కాకపోతే ఏపీలో అది ఇంప్లిమెంట్ కాలేదు.

కావేరి గోదావరి అనుసంధాన చంద్రబాబు తెరమీదకి తీసుకొచ్చారు. దీనికి తమిళనాడు సపోర్ట్ కావాలి. అందుకే విజయ్ ని అప్రోచ్ అయ్యారు. నిజానికి ఇది జగన్ మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. అందుకే అనిల్ రెడ్డి ద్వారా అనేక రకాల ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు అడ్డు కట్ట వేయడానికి తనవంతుగా వ్యూహాలు రచించారు. ఒక దశలో విజయ్ ఏపీకి రారు అని ప్రచారం జరిగింది. సాక్షి మీడియా కూడా ఇదే ప్రచారం చేసింది. కానీ చంద్రబాబు బుర్ర వేరే కదా. ప్లాన్ ఏ కాదు.. ప్లాన్ బి.. ప్లాన్ సి అమలు చేశారు..

చంద్రబాబు జగన్ ప్రయత్నాలను పసిగట్టి వేరే ప్లాంట్ రూపొందించారు. ఏపీలోని కీలక నాయకులను రంగంలోకి దింపారు. వారిని నేరుగా రికి రాదన్ పండిట్ వెట్రివేల్ వద్దకు పంపించారు. రాధన్ పండిట్ మరెవరో కాదు.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కి వ్యక్తిగత జ్యోతిష్యుడు. పైగా ఈయన విజయ్ కి రాజకీయ సలహాదారు కూడా.. విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పండిట్ ఈయనకు సలహాలు ఇస్తున్నారు. తమిళనాడు టీవీకే విజయం సాధిస్తుందని ముందుగానే అంచనాలు వేశారు.. అవి నిజం కావడంతో విజయ్ ఆయనను బాగా నమ్మారు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య బలమైన సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈయన నియామకాన్ని డీఎంకే విమర్శించినప్పటికీ.. ఆ విమర్శలకు విజయ్ వెనక్కి తగ్గారు. ఆ తర్వాత పండిట్ విషయంలో తాను ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. వెట్రీ వేల్ ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి కి ఆఫీసర్ స్పెషల్ డ్యూటీ కింద పనిచేస్తున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird