Home ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: ఎర్ర బస్సు.. స్పెషల్ ఫ్లైట్..జగన్ కు ఇచ్చారు – Andhra Waves

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: ఎర్ర బస్సు.. స్పెషల్ ఫ్లైట్..జగన్ కు ఇచ్చారు – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: భోగాపురానికి ఎర్ర బస్సు కూడా రాదు.. అటువంటి విమానం ఎందుకని గతంలో ప్రతిపక్షనాయకుడిగా ఉన్న వైఎస్ జగన్ అనేక సందర్భాల్లో విమర్శలు చేశారు. భోగాపురంలో విమానాశ్రయం ఏర్పాటును వ్యతిరేకించాలని ప్రజల్లో లేని ఆలోచన తీసుకొచ్చారు. భోగాపురం విమానాశ్రయానికి వ్యతిరేకంగా అప్పట్లో ఒక పార్టీ కూడా జరిగింది. ఇవేవో ఆరోపణలు కాదు. విమర్శలు కాదు. ఆన్ రికార్డెడ్ వాస్తవాలు. ఈ ప్రాంతంలో విమానాశ్రయం మీద ఎన్ని […]

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: భోగాపురానికి ఎర్ర బస్సు కూడా రాదు.. అటువంటి విమానం ఎందుకని గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ జగన్ అనేక సందర్భాల్లో విమర్శలు చేశారు. భోగాపురంలో విమానాశ్రయం ఏర్పాటును వ్యతిరేకించాలని ప్రజల్లో లేని ఆలోచన తీసుకొచ్చారు. భోగాపురం విమానాశ్రయానికి వ్యతిరేకంగా అప్పట్లో ఒక పార్టీ కూడా జరిగింది. ఇవేవో ఆరోపణలు కాదు. విమర్శలు కాదు. ఆన్ రికార్డెడ్ వాస్తవాలు.

ఈ ప్రాంతంలో విమానాశ్రయం మీద ఎన్ని రకాలుగా విమర్శలు చేసినప్పటికీ.. అడ్డుకోవడానికి కుట్రలు చేసినప్పటికీ చంద్రబాబు ముందుచూపుతో విమానాశ్రయం చేశారు. కేంద్రం సహకారంతో అంతర్జాతీయ స్థాయిలో దానిని నిర్మించారు. భోగాపురం విమానాశ్రయాన్ని ఇటీవల ప్రధానమంత్రి. ఆ ప్రాంతంలో ప్రస్తుతం విమానాల రాకపోకలు మొదలయ్యాయి. భోగాపురం ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేసే స్థాయికి ఎదిగింది. ఒకరకంగా ఇప్పుడు ఉత్తరాంధ్ర అంటే కేరాఫ్ భోగాపురం అనే స్థాయికి ఎదగబోతోంది.

ఒకప్పుడు భోగాపురం ప్రాంతంలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తే హేళన చేసిన జగన్.. ఇప్పుడు అదే అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక విమానంలో దిగడం చర్చకు కారణం. నాడు ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతోంది.. కోవడానికి అనేక రకాలుగా కుట్రలు చేశారు. అయితే ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా కూటమిని సారించడంతో.. కేవలం అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల కాలంలోనే విమానాశ్రయాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసింది. భోగాపురం విమానాశ్రయం నిర్మాణం పూర్తి కావడంతో ఉత్తరాంధ్ర ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. రోడ్ల నిర్మాణం కూడా శరవేగంగా సాగుతోంది.

జగన్ తీరు పట్ల ఇప్పటికే విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు వైసిపి అధినేత జగన్ భోగాపురం విమానాశ్రయాన్ని ఎంతగానో ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలను కాలరాసే విధంగా మాట్లాడిన జగన్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.. భోగాపురంలో ప్రత్యేక విమానంలో దిగిన తర్వాత జగన్ నోటి వెంట మాట రాలేదు. ఎందుకంటే అక్కడ చేసిన.. విమానాశ్రయం నిర్మించిన తీరు ఆ స్థాయిలో అభివృద్ధి చెందింది. ఇప్పటికైనా అభివృద్ధిని అడ్డుకోవడం కాకుండా.. స్వాగతించే కోణంలో జగన్ వ్యవహరించాలని కూటమి నాయకులు సూచిస్తున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird