Home తెలంగాణ Bandla Ganesh: బండ్ల గణేష్ బౌన్స్ చెక్స్ కేసులో.. కీలక మలుపు – Andhra Waves

Bandla Ganesh: బండ్ల గణేష్ బౌన్స్ చెక్స్ కేసులో.. కీలక మలుపు – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


బండ్ల గణేష్: ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కు చెక్ బౌన్స్ కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ కేసులో ఇటీవల ఒంగోలు కోర్టు ఆయనకు ఏడాది జైలు శిక్ష విధించింది. 90 లక్షల జరిమానా కూడా చెల్లించాలని నిర్ణయించింది. అయితే తాజాగా ఈ వివాదంపై ఫిర్యాదుదారుడు జట్టి వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తమ మధ్య ఉన్న సమస్యలు పరిష్కారమయ్యాయని.. వివాదానికి ముగింపు పలికినట్లు ఆయన పేర్కొన్నారు. దీనితో ఇన్నాళ్లపాటు […]

బండ్ల గణేష్: ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కు చెక్ బౌన్స్ కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ కేసులో ఇటీవల ఒంగోలు కోర్టు ఆయనకు ఏడాది జైలు శిక్ష విధించింది. 90 లక్షల జరిమానా కూడా చెల్లించాలని నిర్ణయించింది. అయితే తాజాగా ఈ వివాదంపై ఫిర్యాదుదారుడు జట్టి వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తమ మధ్య ఉన్న సమస్యలు పరిష్కారమయ్యాయని.. వివాదానికి ముగింపు పలికినట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో ఇన్నాళ్లపాటు కోర్టు వరకు వెళ్లిన ఈ వ్యవహారం ఎప్పుడు సరికొత్త మలుపు తీసుకుంది. అసలు బండ గణేష్ కు, వెంకటేశ్వరరావుకు మధ్య వివాదం ఎందుకు వచ్చింది.. 15 సంవత్సరాల స్నేహం కోర్టు కేసు వరకు ఎందుకు వెళ్ళింది.. ఇద్దరి మధ్య ఏం జరిగింది.. అనే విషయాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.

వెంకటేశ్వరరావు, బండ్ల గణేష్‌లకు 15 సంవత్సరాలుగా స్నేహం ఉంది. బండ్ల గణేష్ ఎదుగుదలను దగ్గర నుంచి చూశాడు. ఆయన చిన్న స్థాయి నుంచి కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. అయితే కొన్ని వ్యక్తిగత పరిణామాల వల్ల ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. ముఖ్యంగా వెంకటేశ్వరరావు కుమారుడు మరణించిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇద్దరి మధ్య అహం పెరిగిపోయింది. కొందరు మధ్య భక్తులు జోక్యం చేసుకోవడంతో వివాదం మరింత పెరిగింది. నిజానికి ఈ మధ్య సమస్య పరిష్కరించుకోలేనంత పెద్దది కాదు. చిన్న చిన్న అపార్ధాల వల్ల కోర్టు కేసు వరకు వెళ్ళింది.

కోర్టు తీర్పు బయటకు వచ్చిన తర్వాత ఈ వ్యవహారం మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. అయితే తమ మధ్య ఉన్న వ్యక్తిగత వివాదాన్ని కొందరు అనవసరంగా పెద్దది చేశారు. ఇంటర్వ్యూల పేరుతో తనను ఇబ్బంది పెట్టారని అసహన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ మధ్య వ్యక్తిగతంగా, ఆర్థికంగా ఇటువంటి సమస్యలు లేవని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. బండ గణేష్ తో గతంలో మాదిరిగానే తనకు స్నేహం ఉంటుందన్నారు.

అసలు వివాదం ఎందుకంటే

ఈ 2018లో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదం. ప్రకాశం జిల్లా కు చెందిన జానకిరామయ్య నుంచి బండ గణేష్ 95 లక్షలను అప్పుగా తీసుకున్న అనంతరం జానకిరామయ్య మరణించడంతో ఆయన తండ్రి జెట్టిరావుకు బండ్ల గణేష్ చెక్ ఇచ్చారు. ఆ చెక్కు బ్యాంకులో భౌన్స్ అయింది. దీంతో వెంకటేశ్వరరావు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో 2024 లోనే కింది కోర్టు బండ్ల గణేష్ కు ఏడాది పాటు సాధారణ జైలు శిక్ష.. 95 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ తీర్పుపై ఆయన చేసిన అప్పిల్ ను 2026 నవంబర్‌లో ఒంగోలు కోర్టు కొట్టి వేసింది. శిక్షను సమర్థిస్తూ నాలుగు వారాల్లో ట్రయల్ కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశాలు కూడా జారీ చేసింది.

జెట్టి వెంకటేశ్వరరావు మధ్య కేసు పరిష్కారమైందని చెప్పారు.. కోర్టు తీర్పుపై తదుపరి న్యాయపరమైన చర్యలపై క్లారిటీ రావాల్సి ఉంది. బండ్ల గణేష్ తో వివాదం సుఖాంతమైందని జెట్టి చెప్పడం.. మళ్లీ స్నేహం కొనసాగుతుందని ప్రకటించడం ఈ వ్యవహారంలో గమనించాల్సిన విషయం.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird