Home తెలంగాణ రేవంత్ రెడ్డి: పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు – Andhra Waves

రేవంత్ రెడ్డి: పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Revanth Reddy:సిద్దిపేట సభలో హరీష్ రావును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా వదిలిపెట్టలేదు. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి భాష గురించి.. మాట్లాడే విధానం గురించి తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఒక దశలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఉత్తమమని వ్యాఖ్యనిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి […]

Revanth Reddy:సిద్దిపేట సభలో హరీష్ రావును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా వదిలిపెట్టలేదు. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి భాష గురించి.. మాట్లాడే విధానం గురించి తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఒక దశలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఉత్తమమని వ్యాఖ్యనిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. పైగా రాజగోపాల్ రెడ్డి కి గులాబీ పార్టీ అనుకూల మీడియా విపరీతమైన ప్రయారిటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి తీరు పట్ల ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు.

సిద్దిపేట సభలో రాజగోపాల్ రెడ్డి పేరును పరీక్షించి మాట్లాడారు. చెడు మైక్ ముందు మాట్లాడుతూ.. మంచి తన చెవిలో చెబుతున్నారని అన్నారు. అటువంటి ఉపేక్షించేది లేదని.. ఆ తరహా నాయకులను మా కార్యకర్తలు చూసుకుంటారని రేవంత్ రెడ్డిని స్పష్టం చేశారు.

రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కూడా జోరుగా సాగడం లేదు. ఆ మధ్య ప్రభుత్వం ఏర్పాటుచేసిన మద్యం వినియోగం విషయంలో కూడా రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఉన్నారు. తన నియోజకవర్గంలో మద్యం షాపులు ఉండకూడదని.. బెల్ట్ బట్టలకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగడంతో.. మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపులు నడుస్తున్నాయి. అయితే తనకు పదవి రాకపోవడం వెనక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని రాజగోపాల్ రెడ్డి మంత్రి అనుమానిస్తున్నారు. అందుకే అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు. ఇన్ని రోజులపాటు నిశ్శబ్దంగా ఉన్న రేవంత్ రెడ్డి.. మొత్తానికి రాజగోపాల్ రెడ్డిపై తన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం పిచ్చి కుక్క వరకు ఆగిపోతాయా.. లేదా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే దాకా వెళ్తాయా అనేది చూడాల్సి ఉంది. ఈ విమర్శలు చేస్తూ ఎర్రగడ్డకు పంపిస్తానని కూడా రేవంత్ కోమటిరెడ్డికి హెచ్చరికలు పంపారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird