Revanth Reddy: అనుకున్నట్టుగానే సిద్దిపేట సభ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే హరీష్ రావు మీద విమర్శల బాణం ఎక్కు పెట్టారు. హరీష్ రావు బిజెపిలోకి వెళ్తున్నారని సంచలన నిజాన్ని బయటపెట్టారు. బిజెపి పెద్దలతో హరీష్ రావు మంతనాలు జరుపుతున్నారు ఆరోపణలు చేశారు. అక్కడితోనే ఆగలేదు కృష్ణా నది నీటి విషయంలో కూడా సరి కొత్త లెక్కలను బయటపెట్టారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ వద్ద తెలంగాణ నీటి హక్కులకు మంగళం […]
Revanth Reddy: అనుకున్నట్టుగానే సిద్దిపేట సభ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే హరీష్ రావు మీద విమర్శల బాణం ఎక్కు పెట్టారు. హరీష్ రావు బిజెపిలోకి వెళ్తున్నారని సంచలన నిజాన్ని బయటపెట్టారు. బిజెపి పెద్దలతో హరీష్ రావు మంతనాలు జరుపుతున్నారు ఆరోపణలు చేశారు. అక్కడితోనే ఆగలేదు కృష్ణా నది నీటి విషయంలో కూడా సరి కొత్త లెక్కలను బయటపెట్టారు.
కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ వద్ద తెలంగాణ నీటి హక్కులకు మంగళం పాడారని.. రాయలసీమ లిఫ్ట్.. రాయలసీమను రతనాలసీమగా మార్చుతామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. నాడు మంత్రిగా ఉన్న రోజా ఇంటికి కేసీఆర్ కుటుంబంతో సహా వెళ్లారని.. ఆమె వండిన రొట్ల పులుసును తిన్నారని.. రాయలసీమ కోసం కృష్ణానది నీళ్లను ఎంతైనా మంత్రిగా హామీ ఇచ్చారని రేవంత్ రెడ్డి. అటువంటి వ్యక్తి ఇప్పుడు తెలంగాణ హక్కుల కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉంది.
సిద్దిపేటలో వందల కోట్లతో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. హరీష్ రావును తట్టుకొని నిలబడగలిగే కాంగ్రెస్ నాయకులు సిద్దిపేటలో ఉన్నారా అనే ప్రశ్న వ్యక్తమైంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించడం కాంగ్రెస్ పార్టీ నాయకులలో ఉత్సాహాన్ని నింపుతుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే హరీష్ రావు ను తట్టుకొని ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గట్టిగా నిలబడలేదు. కొన్ని సంవత్సరాలుగా సిద్దిపేట గులాబీ పార్టీ మాత్రమే గెలుచుకున్నది. గతంలో కేసీఆర్.. ఆ తర్వాత హరీష్ రావు అన్నట్టుగా అక్కడ రాజకీయం సాగుతోంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో హరీష్ రావు ను ఓడించగలుగుతారా అనే చర్చ కూడా నడుస్తోంది.
సిద్దిపేట సెగ్మెంట్ మీద మైనంపల్లి హనుమంతరావు ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఇటీవల కాలంలో వరుసగా సిద్దిపేటకు ఆయన వస్తున్నారు. హరీష్ రావును ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు. గతంలో మెదక్ నియోజకవర్గంలో తన కుమారుడిని పోటీ చేయించి గెలిపించుకున్నారు. హనుమంతరావు కూడా సిద్దిపేటలో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఆర్థికంగా బలవంతుడు కావడంతో రేవంత్ రెడ్డి కూడా హనుమంతరావుకి సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
