Home సినిమా ప్రమోషన్స్‌ అంటే చాలు వచ్చేస్తాడు.. అనిల్‌ రావిపూడిపై కీర్తి, కృతి సెటైర్లు.! – Andhra Waves

ప్రమోషన్స్‌ అంటే చాలు వచ్చేస్తాడు.. అనిల్‌ రావిపూడిపై కీర్తి, కృతి సెటైర్లు.! – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


సినిమా ప్రమోషన్లను కూడా ఓ వినోదాత్మక కార్యక్రమంలో మార్చడంలో దర్శకుడు అనిల్ రావిపూడి స్టైలే వేరు. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పటి నుంచే ఆసక్తికరమైన వీడియోలు, ఫన్నీ అప్‌డేట్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఇప్పుడు వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘జనవరి 12 విడుదల’ కోసం కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు.

తాజాగా ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్లకు సంబంధించిన ఓ ఫన్నీ వీడియోను మూవీ టీం విడుదల చేసింది. సూపర్‌స్టార్ రజనీకాంత్, శోభన నటించిన మణిరత్నం క్లాసిక్ ‘దళపతి’ సినిమాలో ఓ ఐకానిక్ సీన్‌ను అనిల్ రావిపూడి, కృతి శెట్టి కలిసి రీక్రియేట్ చేశారు.

ఈ వీడియోలో కీర్తి సురేష్‌, కృతి శెట్టి ఓ గర్ల్స్ సాంగ్‌ కోసం రీల్‌ చేసారు. అయితే తను లేకుండా రీల్ చేస్త అనిల్ రావిపూడి హర్ట్. దాంతో ప్రమోషన్ల విషయం వస్తే చాలు వెంటనే వచ్చేస్తాడనే అర్థం వచ్చేలా అనిల్‌పై సరదాగా సెటైర్లు వేశారు హీరోయిన్లు.

‘ప్రమోషన్స్‌ అంటే చాలు.. అందరికంటే ముందుంటాం’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను విడుదల చేశారు. సినిమా ప్రమోషన్లలో అనిల్ రావిపూడి ఎంత యాక్టివ్‌గా ఉంటారో మరోసారి ఈ వీడియోతో సరదాగా చూపించారు. ఇక కీర్తి, కృతి స్టెప్స్ కూడా అదిరిపోయాయి. సోషల్ మీడియాలో ఈ వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

ఇది కూడా చదవండి: భర్త కోసం న్యాయ పోరాటం.. కీర్తి సురేష్‌ని ఎవరూ పట్టించుకోట్లేదేంటి.?

ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్లను నవంబర్ 20 నుంచి ప్రారంభించిన మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల్లో ముందుగానే మ్యూజిక్ ప్రమోషన్లు మొదలుపెడుతున్న చిత్రం ‘జనవరి 12 విడుదల’. ఈ సినిమాకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

వెంకటేష్, కళ్యాణ్ రామ్‌ బావాబామ్మర్దులుగా కనిపించనున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కీర్తి సురేష్‌, కృతి శెట్టి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా షైన్ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఈ సినిమా 2027 జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల జారీ.

మీకు నచ్చవచ్చు:
సాత్విక వీరవల్లి.. ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే వరుస ఆఫర్లు.!
బాలకృష్ణ ‘దాదా’ లేటెస్ట్ అప్డేట్.. సినిమాలో అదిరిపోయే ట్విస్ట్.!

[January 12 Vidudala, Anil Ravipudi, Thalapathi Scene, Keerthy Suresh, Krithi Shetty]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird