ఈపీఎఫ్ఓ తమ ఖాతాదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. పీఎఫ్ విత్రాయల్ నిబంధనలను మరింత సులభతరం చేస్తూ పలు ప్రతిపాదనలకు ఆమోదం ఆమోదం. మరీ ముఖ్యంగా, ఉద్యోగం కోల్పోయిన తర్వాత పూర్తి పీఎఫ్ నగదును తీసుకునేందుకు నిరీక్షణ కాలాన్ని 12 నెలల నుంచి తిరిగి 2 నెలలకు తగ్గించింది. దీనితో పాటు రిటైర్మెంట్ తర్వాత విడతలవారిగా నగదు పొందే ‘సిస్టమాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్’కు పచ్చజెండా ఊపింది. ఈ ఏడాది అక్టోబర్‌లో పూర్తి చేసిన నిబంధనల ప్రకారం.. ఉద్యోగం మానేసిన లేదా కోల్పోయిన వారు పీఎఫ్ సెటిల్మెంట్ కోసం ఏకంగా 12 నెలల పాటు వేచి చూడాల్సి ఉంటుంది.
తాజాగా ఈ నిబంధనను వెనక్కి తీసుకుంది. దీనివల్ల నిరుద్యోగిగా ఉన్న రెండు నెలల తర్వాత తమ పీఎఫ్ ఖాతాలోని పూర్తి నగదును ముందుగానే క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు మళ్లీ అందుబాటులోకి వచ్చింది. అలాగే ఖాతాలో కనీసం ఉంచాల్సిన బ్యాలెన్స్ పరిమితిని 25 శాతం నుంచి 10 శాతం తగ్గించింది. అయితే, తుది పెన్షన్ ఉపసంహరణకు కనీస నిరీక్షణ కాలం 36 నెలలుగానే కొనసాగుతుందని బోర్డు సూచించింది.
పదవీ విరమణ చేసే ఉద్యోగులు తమ పీఎఫ్ సొమ్మును ఒకేసారి తీసుకోకుండా, తమ అవసరాలకు అనుగుణంగా క్రమబద్ధమైన విడతల్లో తీసుకునే ‘సిస్టమాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్’ను ఈపీఎఫ్ఓ ఆమోదించింది. ఈపీఎఫ్ పథకంలో అవసరమైన సవరణలు చేసిన తర్వాత, సుమారు రెండు నెలల్లో ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త విధానం ప్రకారం రిటైర్ అయిన సభ్యులు తమ పొదుపు పూర్తిగా లేకున్నా, కొంతైనా ఈపీఎఫ్ ఖాతాలోనే ఉంచుకుని విడతలవారీగా పొందవచ్చు.
ఖాతాలో మిగిలి ఉన్న మొత్తానికి సాధారణ ఈపీఎఫ్ వడ్డీ రేటు. ఇందులో పూర్తి సిస్టమాటిక్ విత్‌డ్రాయల్, కొంత మొత్తం ఒకేసారి తీసుకుని మిగిలిన దాన్ని విడతలవారీగా తీసుకోవడం, లేదా కేవలం వడ్డీని మాత్రమే విత్‌డ్రా చేసుకునే ఆప్షన్లు ఉంటాయి. 55 ఏళ్లు పైబడి 5 లక్షల రూపాయలకు మించి పీఎఫ్ నిల్వలు దాదాపు 6.32 లక్షల మందికి దీనివల్ల ప్రయోజనం కలుగుతుందని అంచనా.
