.webp)
ఎల్ నినో ప్రభావం ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా ఇండియాలో ఈ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయని డబ్ల్యుహెచ్ వో గుర్తించింది. అసాధారణ ఉష్ణోగ్రతలు, సారూప్యత లేని వర్షపాతం ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత స్థాయి అత్యవసర స్పందన ప్రణాళికను డబ్ల్యుహెచ్ వో ప్రకటించింది.
వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఆరోగ్యంపై పడే పరిశోధనను కనుగొన్న డబ్ల్యూహెచ్ఓ, అధిక ఆరోగ్య ముప్పు పొందే దేశాలలో ఇండియాను కూడా చేర్చింది. అలాగే బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, శ్రీలంక మాల్దీవులలో కూడా ఇదే ప్రజారోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఎల్ నినో నేరుగా వ్యాధులు వ్యాప్తికి కారణం కాదు కానీ, వాతావరణంలో ఏర్పడిన, ఏర్పడుతున్న విపరీత మార్పులు, కరవు పరిస్థితుల కారణంగా ప్రజారోగ్యానికి ప్రమాదం ఏర్పడే పరిస్థితులు ఉత్పన్నమౌతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
ఈ ముప్పును ఎదుర్కొనేందుకు డబ్ల్యూహెచ్ఓ రూపొందించిన ప్రణాళికలో భాగంగా, వ్యాధులు కట్టడి, సకాలంలో గుర్తింపు, వైద్య సిబ్బందికి శిక్షణ, ఆసుపత్రులలో మౌలిక వసతుల కల్పన, దేశాల మధ్య సమన్వయం వంటి వాటిని దృష్టిలో ఉంచుకుంది. ఇందు కోసం నిధులను కేటాయించి, ప్రాథమిక దశలోనే ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.

భారత్లో ఎల్నినో ప్రభావం వల్ల తలెత్తే ప్రధాన సమస్యలలో తీవ్రమైన వడగాలులు మొదటి స్థానంలో ఉన్నాయి. సాధారణం అసాధారణంగా పెరగడం వల్ల డీహైడ్రేషన్, వడదెబ్బ తగలడంతో పాటు గుండె, శ్వాసకోశ, కండరాల వ్యాధులతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు, ఎండలో నిత్యం పనిచేసే శ్రామికులు ఈ వడగాలుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: సూపర్ ఎల్ నినో ఎఫెక్ట్: ఈ ఏడాది చలికాలం గాయబ్.!
మరోవైపు, వర్షపాతంలో మార్పులు, కొరత కారణంగా డెంగీ, మలేరియా వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. అలాగే నీటి కాలుష్యం కారణంగా ఉదర సంబధిత వ్యాధుల బారిన పడే వారి సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి నుంచే వైద్య మరియు ఆరోగ్య రంగాలను పూర్తి సన్నద్ధం చేయాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది.

ఆసుపత్రుల్లో తగినన్ని మందులు, ఓఎస్ ప్యాకెట్లు, అత్యవసర వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలని, గ్రామీణ ప్రాంతాల్లో శుద్ధిపై ప్రత్యేక నిఘా పెట్టాలని కోరింది. ప్రజలను ఎండ తీవ్రత నుంచి రక్షించేందుకు ముందస్తు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మీకు నచ్చవచ్చు: ఎల్ నినో ఎఫెక్ట్: ఆసియాలో ఆహార సంక్షోభం.. ఇండియాలో కరవు.!
డిసెంబర్ లోనే వడగాల్పులు: ఎల్ నినో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విపత్కర పరిస్థితులు.!
[El Nino, Effect, HealthEmergency, WHO Warning, India, Heatwave, TeluguOne]
