Home ఆంధ్రప్రదేశ్ YCP Leader: ఓటు వేస్తే మటన్.. వైసీపీ నేత ఆఫర్.. – Andhra Waves

YCP Leader: ఓటు వేస్తే మటన్.. వైసీపీ నేత ఆఫర్.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


YCP Leader:ముక్క అంటే ఎవరికి ఇష్టం ఉండదు.. సండే వచ్చిందంటే చాలు చాలామంది ఆహా అనుకుంటూ లాగిస్తారు. నచ్చిన చోట దగ్గరికి వెళ్లి.. క్యూలో ఉంది మరీ ముక్కల కూరల తెచ్చుకుంటారు. యాట మాంసం అంటే ఒక సెంటిమెంట్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలామంది మటన్ ను అమితంగా ఇష్టపడతారు. సరిగ్గా ఇదే సెంటిమెంట్ ను ఆ నాయకుడు పసిగట్టారు. ఇంకేముంది జనాలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. అసలే స్థానిక ఎన్నికలు.. గెలవాలని కోరిక.. ఏమైనా పర్వాలేదు.. […]

వైసీపీ నేత:ముక్క అంటే ఎవరికి ఇష్టం ఉండదు.. సండే వచ్చిందంటే చాలు చాలామంది ఆహా అనుకుంటూ లాగిస్తారు. నచ్చిన చోట దగ్గరికి వెళ్లి.. క్యూలో ఉంది మరీ ముక్కల కూరల తెచ్చుకుంటారు. యాట మాంసం అంటే ఒక సెంటిమెంట్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలామంది మటన్ ను అమితంగా ఇష్టపడతారు. సరిగ్గా ఇదే సెంటిమెంట్ ను ఆ నాయకుడు పసిగట్టారు. ఇంకేముంది జనాలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. అసలే స్థానిక ఎన్నికలు.. గెలవాలని కోరిక.. ఏమైనా పర్వాలేదు.. ఏం చేసినా పర్వాలేదు అనుకున్నాడు.. కానీ అతడు ఒక్కసారి తలుచుకుంటే.. పోలీసులు మరొకరు చేశారు.. చివరికి సీన్ మారిపోయింది..

సారీలు.. విలువైన బహుమతులు.. ఫోన్ పేలు.. గూగుల్ పేలు.. ఇవన్నీ నామోసీ అనుకున్నాడేమో.. కాస్త అప్డేట్ గా ఆలోచించాడు. జనాల వీక్ పాయింట్లు తెలుసుకున్నారు. ఏముంది పసిగట్టాడు. రంగంలోకి దిగాడు. ప్రచారం చేస్తున్నాడు. గట్టిగా పని మొదలు పెట్టాడు. కానీ అతడు అనుకున్నది కాకుండా.. వేరేది జరిగింది. చివరికి ఆ ఫ్యాన్ పార్టీ నేత పరిస్థితి దారుణంగా మారింది.

ఏపీలో స్థానిక ఎన్నికలు జరుగుతున్న తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజంగా ఇలా చేస్తారా.. ఇలా కూడా చేస్తారా అనిపిస్తోంది. ముఖ్యంగా ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు గెలవడానికి తొక్క అడ్డదారులు చూస్తే.. ఇంతకు తెగించారా.. ఇంతకు దిగజారాలా అనిపిస్తోంది.లోకల్ బాడీ రణంలో గెలిచే అవకాశాలు లేకపోవడంతో ఇప్పటికే చాలామంది వైసిపి అభ్యర్థులు తమ నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. పోటీలో ఉన్న వ్యక్తులు అంతకు మించి అనే ర లో డబ్బులు వెదజల్లుతున్నారు. సాక్షాత్తు జగన్ ఇలాకా లోనే వైసిపికి దిక్కు మొక్కూ లేకుండా పోయింది. కానీ వైసీపీలో కొంతమంది అలా ఉన్నారు. కూటమి నేతలకు అవకాశం ఇవ్వడం లేదు. అందువల్లే పోటీలో ఉంటున్నారు. అలా పోటీలో ఉన్న ఓ వైసిపి నాయకుడు తన స్థాయికి మించి ఖర్చు పెట్టాడు. కానీ ఖాకీలకు సమాచారం తెలియడంతో అతని ప్లాన్ బెడిసి కొట్టింది.

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం లో ఓ వైసీపీ నేత స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఇక్కడ పోటీ హోరాహోరీగా ఉండటంతో ఓటర్లకు ఎర వేయడం షూరు చేశాడు. ఓటుకు కరెన్సీ నోట్లు కాకుండా.. మటన్ కూడా పంపిణీ చేయడం మొదలు పెట్టాడు. సమాచారం తెలిసిన పోలీసుల రంగంలోకి దిగారు. ఆ వ్యక్తిని పట్టుకున్నారు. చీమకుర్తి మండలం అయ్యపురాజు పాలెం గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఈ గ్రామంలో వైసీపీ నాయకుడు చిన్నపరెడ్డి రమణారెడ్డి ఎంపిటిసి ఎన్నికల పోటీ చేస్తున్న తమ అభ్యర్థి గెలుపు కోసం రంగంలోకి దిగాడు. ఏకంగా పొట్టేలను ఇతర ప్రాంతాల నుంచి తెప్పించాడు. సుమారు 6 లక్షలు ఖర్చుపెట్టాడు. ఈ గ్రామంలో 600 గృహాలు ఉన్నాయి. ఇంటికి ఒక కేజీ చొప్పున మటన్ అందించాడు డిసైడ్ అయ్యాడు. పొట్టెలను వధించి.. మటన్ కట్ చేయడం మొదలుపెట్టాడు. విషయం తెలుసుకున్న సర్కిల్ ఇన్ స్పెక్టర్.. సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. మాంసం పంపిణి అడ్డుకున్నారు. అంతేకాదు రమణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పొట్టేలను స్వాధీనం చేసుకున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird