Home సినిమా ఇద్దరి గుండెలపైన: ‘డెస్టినీ’ సాంగ్ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి.! – Andhra Waves

ఇద్దరి గుండెలపైన: ‘డెస్టినీ’ సాంగ్ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి.! – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దినేష్ కుర్ర నిర్మాణం చిత్రం ‘డెస్టినీ’. ఈ మూవీకి ముద్దుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో జబర్దస్త్ ఇమాన్యుయేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. శ్రీ సత్య, ఆమని, రవి ప్రకాష్, కిరీటి, శివ కోట్ల ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. రీసెంట్‌గా నందినీ రెడ్డి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ యూత్ ఫుల్ లవ్ సాంగ్‌ను విడుదల చేశారు.

‘ఇద్దరి గుండెలపైన’ అంటూ సాగే ఈ ప్రేమ గీతాన్ని హిట్ మెషిన్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేసి టీంకు బెస్ట్ విషెస్ అందించారు. పాట చాలా బాగుందని, సినిమా కాన్సెప్ట్ విన్నాను, చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఇమాన్యుయేల్ చాలా క్లోజ్ అని, ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

మారుతి రాజా అందించిన బాణి యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది. చూస్తుంటే ఈ పాట ఇన్‌స్టంట్ చార్ట్ బస్టర్‌గా మారుతుందేమోనని అనిపిస్తోంది. ఈ పాటకు శ్రీరామ్ తపస్వి సాహిత్యం, సాయి చరణ్ భాస్కరుణి, అభిఖ్య తణికెళ్ల గాత్రం ప్రధాన ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. ఇక చంద్రకిరణ్ మాస్టర్ స్టెప్పులు ఎంతో సింపుల్‌గా, అందరూ రీల్స్‌తో ట్రెండ్ చేసేలా ఉన్నాయి. ఆయన కొరియోగ్రఫీతో ఈ పాట మరింత అందంగా మారింది.

ఈ మూవీకి మారుతి రాజా సంగీతం అందిస్తుండగా, పంకజ్ తొట్టాడ కెమెరామెన్‌గా వర్క్ చేస్తున్నారు. డి. వెంకట ప్రభు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ఇతర అప్‌డేట్‌లను ప్రకటించనున్నారు.

ఇది కూడా చదవండి: పాకెట్ రాకెట్స్.. గ్యాబ్లింగ్ సినిమాతో సర్ప్రైజ్ చేసిన నిహారిక కొణిదెల.!

[Anil Ravipudi, Iddari Gundela Paina Song, Destiny Movie, Jabardasth Emmanuel, Sri Satya, Chendu Muddu, Telugu Songs, Telugu Film News]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird