Table of Contents
దీపావళి పండుగ సమీపిస్తుండటం, దీనికి తోడు త్వరలోనే పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభం కాన దేశీయ మార్కెట్లో పసిడి కొగోళ్లు పెరుగుతాయి. ఇక గత కొన్ని రోజులుగా దిగి వస్తున్న బంగారం ధరలు.. కొనుగోలుదారులకు భారీగా ఊరట కలిగించాయి. పండగ వరకు ధర తగ్గే విధంగా కొనసాగితే.. దీపావళి వేళ పసిడి కొనుగోలు చేయడం చాలా మంది భావించారు. అయితే వారి ఆశలను అడియాసలు చేస్తూ.. ఇన్నాళ్లు దిగి వచ్చిన ధర ఇప్పుడు పైకి ఎగబాకుతుంది. . అక్టోబర్ 29, గురువారం కూడా బంగారం ధరలు మరింతగా పుంజుకుని పసిడి ప్రియులకు షాక్ ఇచ్చాయి.
ఈ వారంలో సోమవారం నుంచే పసిడి ధరల్లో వరుస పెరుగుదల నమోదు కావడం. విపరీతమైన పండుగ డిమాండ్, కొనుగోళ్లు పెరగడమే ఈ రికార్డు స్థాయి పెరుగుదలకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
బంగారం ఎందుకింతలా పెరుగుతోంది
ప్రస్తుతం పండుగ సీజన్లో తాజా మార్కెట్లో బంగారం కొనుగోళ్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. మరికొద్ది రోజుల్లోనే దీపావళి వేడుకలు ఉండటంతో ఇటు వినియోగదారులు, అటు వ్యాపారులు పెద్ద యెత్తున బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు వరుసగా వివాహ ముహూర్తాలు కూడా రాన కొత్త పసిడికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుంది ధరలు మరిన్ని గరిష్ఠాలను తాకే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రధాన నగరాల్లో పసిడి ధరల వివరాలు
గురువారం నాటి ట్రేడింగ్ ప్రకారం దేశంలోని ముఖ్య అతి ముఖ్యమైన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు ఈ విధంగా నమోదు అయ్యాయి:
- హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల (స్వచ్ఛమైన) 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,960 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు రూ.1,31,960గా ఉంది.
- ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,44,110 పలుకుతుండగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,32,110గా ట్రేడవుతోంది.
బంగారానికి వ్యతిరేకంగా వెండి ధర
ఒకవైపు బంగారం ధరలు ఆకాశన్నంటుతుంటే, మరోవైపు ధరలు మాత్రం కాస్త భిన్నంగా స్పందించాయి. గురువారం వెండి రేట్లు స్వల్ప క్షీణతను నమోదు చేశాయి.చెన్నై, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం: ఈ నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,19,900 వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీలో కిలో వెండి రేటు రూ.2,19,900 వద్ద స్థిరపడింది.
మరిన్ని వ్యాపార వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
The post గోల్డెన్ షాక్.. మరోసారి ధరలు పైకి appeared first on iDreamPost.
