Home సినిమా ధూమకేతు: ఫస్ట్ నైట్.. గదిలోకి వెళ్ళగానే.. వరదుడికి ఆ సమస్య..ఇదేం సినిమా రా బాబూ.. – Andhra Waves

ధూమకేతు: ఫస్ట్ నైట్.. గదిలోకి వెళ్ళగానే.. వరదుడికి ఆ సమస్య..ఇదేం సినిమా రా బాబూ.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper



ధూమకేతు: చూస్తే ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగించాలి. తెలిసిన కథ అయినా .. దానిని కొత్తగా చెప్పాలి. స్క్రీన్ ప్లే తో మాయ చేయాలి. ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించాలి.. చిన్న చిన్న బడ్జెట్ లోనే వాటిని పూర్తి చేయాలి. ఇవన్నీ కూడా మలయాళ దర్శకులకు కొట్టినపిండి. అందువల్లే వారు తీసే సినిమాలు కొత్తగా అనిపిస్తుంటాయి. బిర్యాని లాంటి సినిమాలు తీయకపోయినప్పటికీ.. చారు అన్నం లాంటి సినిమాల్లోనే వారు కొత్తదనం చూపిస్తారు. అలా మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన తాజా చిత్రం ధూమకేతు. ఈ సినిమా ఇటీవల విడుదలైంది. ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉంది.. పూర్తి రివ్యూ లేట్ చేయకుండా చదివేయండి.

కథ ఎలా ఉందంటే

ధూమకేతు ఈ సినిమాలో హీరో పేరు లలిత్ కుమార్ కుట్టన్(సజిన్ గోపు) కు ఆలస్యంగా షర్మిల (నిఖిలా విమల్) తో పెళ్లి జరుగుతుంది. లేటు వయసులో పెళ్లి కావడంతో లలిత్ కుమార్ ను ఆటపట్టిస్తారు. వివాహం తర్వాత మొదటి రోజు రాత్రి గదిలోకి వెళ్తాడు. ఒక వ్యక్తి అందులోకి ప్రవేశిస్తారు. లలిత్ మీద దాడి చేశాడు. షర్మిలను ఎత్తుకు వెళ్తాడు. దీనితో లలిత్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తాడు నిద్ర లేచిన అతనికి అనుకొని పరిణామం కళ్ళ ముందు కనిపిస్తుంది. ఏమైందని చూస్తే.. అంతకుముందు జరిగినట్టుగానే పెళ్లి మండపం వద్దకు వెళ్లడానికి త్వరగా సిద్ధం అవ్వమని. ఆయన తల్లి చెబుతుంది. పందిరి ఏర్పాటు చేయడానికి వచ్చిన వ్యక్తి చెట్టు మీద నుంచి పడతాడు. కాలు పెరుగుతుంది. సరిగ్గా వధువు మెడలో తాళి కడుతున్న సమయంలో సమీపంలో పిడుగు పడడంతో ఒక వృద్ధుడు చనిపోతాడు ఇవన్నీ కూడా పునరావృతం అవుతుంటాయి.

మరోసారి లలిత్ ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళినప్పుడు కూడా.. మరోసారి ముసుగు ధరించిన వ్యక్తి దాడి చేశాడు. షర్మిలను తీసుకెళ్తాడు. దీంతో లలిత్ ఉలిక్కి పడి లేస్తాడు. ఇలా నాలుగు సార్లు జరుగుతూ ఉంటుంది.. ఎందుకు ఇలా అవుతుందో లలిత్ దిగాలుగా కూర్చుంటాడు. ఈ నేపథ్యంలో షర్మిల గురించి అతనికి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఇంతకీ షర్మిల ఎవరు.. ఆమె నేపథ్యం ఏమిటి.. ముసుగు ధరించిన వ్యక్తులు ఎందుకు వస్తున్నారు. ఇందులో టైగర్ శేఖరం కుట్టి(షైన్ టామ్ చాకో) ప్రమేయం ఏముంది.. అతడికి ఆమెకు సంబంధం ఏంటి.. లలిత్, అతడి సతీమణి వైవాహిక జీవితం ఏమవుతుంది.. ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఎలా తీశారు అంటే

ధూమకేతు ఈ సినిమా మొత్తం గతం, వర్తమానం నేపథ్యంలో ఉంటుంది. కొన్ని సన్నివేశాలు హాలీవుడ్ సినిమాలను గుర్తుకు తెస్తాయి. తమిళంలో శింబు హీరోగా మానాడు అనే సినిమా కూడా ఇలాంటి నేపథ్యంలోనే వచ్చింది. కాకపోతే ధూమ కేతు సినిమాలో పెళ్లిని.. శోభనం గదిని ముడిపెట్టారు. ఈ సినిమా ఆలోచన కొత్తగా అనిపిస్తుంది. ఫస్టాఫ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా హీరో మ్యారేజీ.. అదే టైంలో సీన్స్ మొత్తం రిపీట్ అవుతుంటాయి. దీంతో ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెరిగిపోతుంది.. ఎందుకిలా.. ఏమైంది.. ఏం జరుగుతోంది.. ఇందులో నుంచి బయటికి రావడానికి లలిత్ ఏం చేస్తాడు.. కథానాయకుడు గతంలో ఏం చేసింది.. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే సెకండ్ హాఫ్ లో కథనాయక గతం గురించి లలిత్ చేసిన ప్రయత్నాలు. ఆమె గతం గురించి డైరెక్టర్ న్యారేషన్.. అంతగా ఆసక్తిగా అనిపించింది. ఇక సినిమా క్లైమాక్స్ సన్నివేశాలు రొటీన్ గా ఉంటాయి. ఇక ఈ సినిమా ప్రారంభంలోనే అరుదైన తోకచుక్క గురించి చెప్తారు. సినిమా స్టోరీకి..దానిని లింక్ చేసిన తీరు అంతగా కనెక్ట్ కాదు. అలాంటప్పుడు దర్శకుడు ఈ సీన్స్ ఎందుకు రాసుకున్నాడు అనేది అర్థం కాదు.

ఇక ఈ సినిమాలో లలిత్ పాత్రలో సజిన్ గోపు నటన బాగుంది. టైం లూప్ జరుగుతున్నప్పుడు అవే సీన్స్ మళ్ళీ వస్తున్నప్పుడు.. ప్రేక్షకులకు ఏమాత్రం బోర్ కొట్టకుండా.. తన కామెడీతో ఆకట్టుకుంటాడు. అతడు నటనను ప్రేక్షకులకు చూపించడానికి గొప్ప సన్నివేశాలు ఇందులో లేవు. లలిత్ స్నేహితుడిగా గణపతి నటించారు. ఈ పాత్రకు అతడు నూటికి నూరుపాళ్ళు సరిపోయాడు. ఇక మిగిలిన కాస్ట్ అండ్ క్రూ బెటర్ ఫెర్మానెన్స్ ఇచ్చారు. దర్శకుడు సుధీ మాడిసన్ ఆలోచన గొప్పగానే ఉంటుంది.. దానిని నేను మీద ప్రజెంట్ చేయడంలో అంతగా విజయం సాధించలేదు. అయితే ఈ సినిమా రన్ టైం కేవలం రెండు గంటల లోపే ఉండటం విశేషం.

ఇక ఈ సినిమా కుటుంబంతో కలిసి చూడొచ్చు..నెట్ ఫ్లిక్స్ లో తెలుగు ఆడియో కూడా ప్రేక్షకులకు అందుబాటులో ఉంది.

సినిమా బలాల విషయానికొస్తే

హీరో నటన, ఫస్టాఫ్, సినిమా నిడివి..

మైనస్ పాయింట్లు

సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లు..

చూసినట్టుగా అనిపించే క్లైమాక్స్..

చివరి మాట.. ధూమకేతు.. భారీ అంచనాలు పెట్టుకోకుండా చూస్తే బెటర్..

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird