.webp)
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ప్రచార చిత్రాలు బయటకు వచ్చినప్పటి నుంచి మరో చర్చ కూడా నడుస్తోంది. తమిళంలో అర్జున్ నటించిన ‘బ్లాస్ట్’ సినిమా, ‘ఆదర్శ కుటుంబం’ కథలకు పోలికలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఈ వ్యవహారంపై స్పందించింది. రెండు సినిమాల కథలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ పోలికల చర్చ మరింత పెరిగింది. ఒక సాధారణ కుటుంబం వెనుక ఊహించని కోణాలు ఉండటం, యాక్షన్ అంశాలు చోటుచేసుకోవడం వంటి రెండు సినిమాల్లోనూ ఉన్నాయంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే శ్రీనిధి శెట్టి మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించింది.
తాను ‘బ్లాస్ట్’ సినిమా చూశానని, ‘ఆదర్శ కుటుంబం’ కథతో ఎలాంటి పోలికలు కనిపించలేదని చెప్పింది. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’, ‘దృశ్యం’ వంటి సినిమాలతోనూ తమను పోలుస్తున్నారని, కానీ ఈ సినిమా వాటన్నింటికీ భిన్నంగా ఉన్నట్లు వివరించారు.

దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలంటే ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన అంచనా ఉంటుంది. ఆయన మార్క్ డైలాగులు, కుటుంబ భావోద్వేగాలు, వినోదం ప్రధానంగా కనిపిస్తుంటాయి. అయితే ‘ఆదర్శ కుటుంబం’ మాత్రం ఆయన గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది శ్రీనిధి.
త్రివిక్రమ్ గత సినిమాలన్నీ తాను చూశానని, ఈ సినిమాలో కొత్త తరహా కథను చూస్తారని చెప్పుకొచ్చింది. ఆయన దర్శకత్వంలో నటించాలని చాలా కాలంగా అనుకుంటున్నానని, అనుకోకుండా ఆయన నుంచి ఫోన్ రావడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని. నటిగా తనకు అన్ని విధాల సంతృప్తినిచ్చే ప్రాజెక్ట్ ఇదని.
‘కేజీఎఫ్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి.. ‘ఆదర్శ కుటుంబం’లో వెంకటేష్ భార్యగా నటిస్తోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ చిత్రం ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. అక్టోబర్ 30న ఈ సినిమా థియేటర్లలో విడుదల.
ఇది కూడా చదవండి: చిరంజీవి కొత్త అవతారం.. ఓటీటీ షో టైటిల్ ఇదే.!
[Aadarsha Kutumbam vs Balst, Srinidhi Shetty Interview, Aadarsha Kutumbam Movie Story, Aadarsha Kutumbam Release Date, Srinidhi Shetty, Venkatesh, Trivikram Srinivas, Blast Movie, Telugu Film News]
