వెంకటేష్: అనేక పర్యాయాలు వాయిదాలు పడిన తర్వాత దాదాపు 30 సంవత్సరాల ప్రేక్షకుల ముందుకు ఆదర్శ కుటుంబం వస్తోంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక మల్లారెడ్డి కాలేజీలో జరిగింది. టాక్సిక్ సినిమా నేర్పిన అనుభవంతో ఈసారి ఇండోర్ లో జరిగింది. పైగా మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి.. కోడలు ప్రీతి రెడ్డి 17వ వివాహ వార్షికోత్సవం కూడా ఇదే రోజు. తమ వివాహ వార్షికోత్సవం రోజు ప్రత్యేకంగా ఉండాలని ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను […]
వెంకటేష్: అనేక పర్యాయాలు వాయిదాలు పడిన తర్వాత మొత్తానికి దాదాపు 30 సంవత్సరాల ప్రేక్షకుల ముందుకు ఆదర్శ కుటుంబం వస్తోంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక మల్లారెడ్డి కాలేజీలో జరిగింది. టాక్సిక్ సినిమా నేర్పిన అనుభవంతో ఈసారి ఇండోర్ లో జరిగింది. పైగా మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి.. కోడలు ప్రీతి రెడ్డి 17వ వివాహ వార్షికోత్సవం కూడా ఇదే రోజు. తమ వివాహ వార్షికోత్సవం రోజు ప్రత్యేకంగా ఉండాలని ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను మల్లారెడ్డి కాలేజీలో నిర్వహించడం జరిగింది.
ఈ సినిమా విడుదల అనేక పర్యాయాలు వాయిదా పడిన తర్వాత.. మొత్తానికి దాదాపు 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఇంత బాగానే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారని.. సినిమా విడుదల వాయిదా పడడం వెనుక ఉన్న కారణాలను చెబుతారని అందరు అనుకున్నారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. ఇటీవల కాలంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రతి కార్యక్రమంలో పాల్గొని అద్భుతంగా మాట్లాడారు. కానీ తాను మాట్లాడుతున్న ఆదర్శ కుటుంబం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాత్రం అంత గొప్పగా లేదు. ఏదో మైక్ ఇచ్చారు కాబట్టి.. తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడాలి కాబట్టి.. అన్నట్టుగా మాట్లాడి వెళ్లిపోయారు.
ప్రొడ్యూసర్ చిన బాబు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసినట్లు ప్రకటించారు. తన మార్కు కామెడీ లేదు. మాటల్లో ప్రాస లేదు. వెంకటేష్ తో 20 సంవత్సరాల తర్వాత సినిమా చేస్తున్న గొప్ప ఫీలింగ్ కనిపించలేదు.. ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎంతో కొంత సందడి చేసిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది తమన్, వెంకటేష్ మాత్రమే. హీరోయిన్ శ్రీనిధి తన అనుభవాలను చెప్పుకుంది. కాకపోతే అవి సినిమాటిక్ మాదిరి కాకుండా.. జెన్యూన్ గా ఉన్నాయి..
త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం ప్లాప్ తర్వాత మెగా ఫోన్ పట్టిన సినిమా ఇది. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ఆయన బిగ్ స్క్రీన్ మీదకి వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన మాట్లాడే మాటకు.. ఆయన చూపించే హ్యూమర్ కోసం చాలామంది వెయిట్ చేశారు. కానీ వారందరి ఆశల మీద నీళ్లు చల్లారు త్రివిక్రమ్ శ్రీనివాస్. పైగా ఈ సినిమాలో క్రైమ్ తో పాటు కామెడీ కూడా ఉంటుందట. అయితే ఆయన గత సినిమాల మాదిరిగా కాకుండా.. కాస్త డార్క్ కామెడీ ఉంటుందట. కొన్ని సన్నివేశాలు ఊహకు అందకుండా సాగుతాయట..
ఇటీవల కాలంలో డార్క్ కామెడీతో బ్లాక్ బస్టర్ హిట్లు సాధించిన జైలర్ దర్శకుడు నెల్సన్.. బీస్ట్ సినిమాల ద్వారా తన పెన్ పవర్ ఏంటో చూపించారు. డార్క్ కామెడీలో కొత్త యాంగిల్ చూపించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అయిన తర్వాత.. దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. పైగా ఆయన ఈ సినిమా లో డార్క్ కామెడీ ప్రయత్నించారు. ఈ సినిమా టీజర్ విడుదలలో కాస్త అనిల్ రావిపూడి తరహాలో సన్నివేశాలు కనిపించాయి. అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి కాదట.. ఏకంగా డార్క్ కామెడీ ట్రై చేశారట. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ నెల్సన్ ను ఫాలో అవుతున్నారా.. అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
