హారర్ సినిమాలు చూడటానికి ఇష్టపడేవారికి కొత్త కొత్త కథలు ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తాయి. ముఖ్యంగా ఓ పాత ఇంట్లో దాగి ఉన్న రహస్యాలు, అక్కడ జరిగే వింత సంఘటనల చుట్టూ సాగే కథలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తాయి. అలాంటి కథాంశంతో రూపొందించిన తెలుగు హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఇది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ఓసారి చూసేయండి.
ఈ సినిమా కథ విషయానికొస్తే ..అర్జున్ అనే యువ రచయిత తన నవలతో అనూహ్యమైన విజయాన్ని అందుకుంటాడు. అతని పుస్తకం భారీగా అమ్ముడవడంతో సంతోషించిన ఓ వ్యక్తి అతడికి విల్లాను బహుమతిగా ఇస్తాడు. దీంతో అర్జున్ కుటుంబ సభ్యులు ఆ ఇంటికి మారతారు. అతడి సోదరుడు సంజయ్, సంజయ్ భార్య నిత్య కూడా అక్కడే నివసించడం ప్రారంభిస్తారు.
అయితే కొత్త ఇంట్లోకి వెళ్లిన కొద్దిరోజులకే విచిత్రమైన సంఘటనలు మొదలవుతాయి. ఇంట్లో ఎవరికీ అర్థంకాని శబ్దాలు, వింత అనుభవాలు కుటుంబ సభ్యులను భయపెడతాయి. రోజులు గడిచేకొద్దీ పరిస్థితులు మరింత తీవ్రంగా మారతాయి. అసలు ఆ విల్లాలో ఏదైనా అతింద్రియ శక్తి ఉందా? అక్కడ గతంలో ఏం జరిగింది? ఈ సమస్య నుంచి కుటుంబం ఎలా బయటపడింది? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ సినిమా మరేదో కాదు ‘ఇంటి నంబర్ 13’ . ఈ సినిమా నిడివి సుమారు 2 గంటల 7 నిమిషాలు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఈ సినిమా చూడకపోతే వెంటనే చూసేయండి.
మరిన్ని ఓటిటి అప్‌డేట్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
The post గిఫ్ట్ గా విల్లా..తీరా ఇంటికి వెళ్తే!ఈ తెలుగు హర్రర్ చూశారా? iDreamPostలో మొదట కనిపించారు.
