ప్రపంచంలో వర్షాలు పెరుగుతున్నా నదులు, సరస్సులు, జలశయాల్లో నీరు మాత్రం తగ్గిపోతోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. 2023, 2024లో నమోదైన రికార్డు స్థాయిల కారణంగా ప్రపంచవ్యాప్తంగా మంచినీటి నిల్వలు భారీగా తగ్గిపోయాయి. చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్ అంతర్జాతీయ పరిశోధకుల బృందం నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 1991 నుంచి 2025 వరకు ప్రపంచంలోని 150 ప్రధాన నదీ పరివాహక ప్రాంతాలతో పాటు 12 లక్షలకు పైగా సరస్సులు, జలశయాల ఉపగ్రహ చిత్రాలను పరిశీలించారు. 2023–24లో నదుల నీటి ప్రవాహం సాధారణ స్థాయితో పోలిస్తే 5.7 శాతం తగ్గింది. సరస్సులు, జలాశయాల్లో నిల్వ ఉన్న నీరు ఏకంగా 9.5 శాతం పడిపోయింది. 1991 తర్వాత ఈ స్థాయిలో ఒకేసారి తగ్గడం ఇదే తొలిసారి.
నడుల్లో 2 వేల ఘన నీటిలో నీరు తగ్గుదల
ఈ అధ్యయనం ప్రకారం 2023, 2024 సంవత్సరాల్లో ప్రపంచ నదుల నీటి ప్రవాహం ఏడాదికి సగటున సుమారు 2,040 ఘన నీటి ప్రవాహం తగ్గింది. సరస్సులు, జలాశయాల్లో దాదాపు 640 ఘన నీటి నిల్వలు తగ్గాయి. అంటే ఇది ఏదో ఒక దేశానికి, ఒక పరిమితమైన సమస్య కాదు. ప్రపంచవ్యాప్తంగా మంచినీటి వనరులపై ప్రభావం పడిందని సూచించింది. సాధారణంగా వర్షాలు ఎక్కువగా పడితే నదులు, జలశయాల్లో నీరు పెరగాలి. కానీ ఈ రెండేళ్లలో అలా జరగలేదు. ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం పెరిగినప్పటికీ అదనపు వర్షంలో ఎక్కువ భాగం సముద్రాలపై కురిసింది. భూభాగాలపై నీటి కొరత ఏర్పడటంతో నదులు, సరస్సుల నిల్వలు తగ్గాయి.
దక్షిణ అమెరికాలో పరిస్థితి మరింత దారుణం
నీటి నిల్వలు తగ్గిన దక్షిణ అమెరికా ముందుంది. ప్రపంచవ్యాప్తంగా నదుల నీటి ప్రవాహం తగ్గిన మొత్తంలో దాదాపు 70.4 శాతం వాటా ఈ ఖండితమే. అక్కడ నదుల ప్రవాహం 17.8 శాతం తగ్గగా, సరస్సులు, జలాశయాల్లో నీటి నిల్వలు 16.5 శాతం పడిపోయాయి. అమెజాన్ నదీ పరివాహక ప్రాంతంలో గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ నీటి ప్రవాహం నమోదైంది. ఇక్కడ మరో విచిత్రమైన పరిస్థితి కనిపించింది. దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాలు కురిసి వరదలు వచ్చాయి. అదే సమయంలో సంబంధిత కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అంటే ఒకే ఖండంలో కొన్ని చోట్ల వరదలు, చోట్ల నీటి కొరత ఏర్పడింది. వాతావరణంలో మార్పులు ఎంత అనూహ్యంగా మారుతున్నాయో ఈ పరిస్థితి చెబుతోంది.
ఎల్నినో కారణమా?
ఈ నీటి కొరతకు ఎల్నినో ప్రభావంతో పాటు ఉష్ణమండల ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం అసాధారణంగా వేడెక్కడం కూడా కారణమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఎల్నినో కారణంగా పసిఫిక్ మహాసముద్రంలోని నీటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. అదే సమయంలో ఉత్తర అట్లాంటిక్లోనూ సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ రెండు పరిస్థితులు గాలుల దిశను, తేమ ప్రయాణాన్ని ప్రభావితం చేశాయి. ఫలితంగా భూభాగాలపై కురవాల్సిన వర్షంలో కొంత భాగం సముద్రాల వైపు మళ్లింది. దక్షిణ అమెరికాలో ఎల్నినో ప్రభావం అట్లాంటిక్ సముద్రపు వేడిని మరింత పెంచిందని పరిశోధకులు వివరించారు. భూమిపై నదులు పెరగడం వల్ల నేల, సరస్సుల నుంచి నీరు ఆవిరయ్యే వేగం కూడా పెరుగుతుంది.
2025లో కొంత మెరుగుదల
2025లో ఎల్నినో ప్రభావం బలహీనపడటంతో ప్రపంచ నదుల నీటి ప్రవాహం మళ్లీ సాధారణ స్థాయికి దగ్గరగా వచ్చినట్లు అధ్యయనం. అయితే 2025 కూడా ఇప్పటివరకు నమోదైన అత్యంత వేడి సంవత్సరాల్లో మూడో స్థానంలో నిలిచింది. భవిష్యత్తులో భూతాపం పెరిగితే ఇలాంటి పరిస్థితులు తరచుగా ఎదురయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నదులు, సరస్సులు, జలాశయాల్లో నీరు తగ్గితే సరఫరా, వ్యవసాయం, జలవిద్యుత్ ఉత్పత్తి, జలచరాల జీవనంపై ప్రభావం పడుతుంది. వర్షాలు పడుతున్నాయంటే నీటి కొరత ఉండదని భావించడం కూడా సరికాదని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. వాతావరణ మార్పులతో ఎప్పుడు వరదలు వస్తాయో, ఎప్పుడు నీటి కొరత ఏర్పడుతుందో అంచనా వేయడం మరింత కష్టంగా మారుతోంది.
మరిన్ని టెక్నాలజీ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
