Home తెలంగాణ కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి, అనిరుధ్ రెడ్డి అసమ్మతి – Andhra Waves

కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి, అనిరుధ్ రెడ్డి అసమ్మతి – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి అసమ్మతి స్వరాలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. కొత్త ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జ్ బీఎం సందీప్ ఇద్దరితో త్వరలో భేటీ అయి పార్టీ క్రమశిక్షణపై స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఒకవేళ సమస్యలు ఉంటే అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలే తప్ప, బహిరంగంగా విమర్శలు చేయడం సరికాదని. ఈ భేటీలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల నిధులకు విడుదల చేసిన జాప్యం, అధికారుల తీరు, […]

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి అసమ్మతి స్వరాలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. కొత్త ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జ్ బీఎం సందీప్ ఇద్దరితో త్వరలో భేటీ అయి పార్టీ క్రమశిక్షణపై స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఒకవేళ సమస్యలు ఉంటే అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలే తప్ప, బహిరంగంగా విమర్శలు చేయడం సరికాదని.

ఈ భేటీలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల నిధుల విడుదలలో జాప్యం, అధికారుల తీరు, పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు దక్కకపోవడం వంటి సమస్యలను ప్రస్తావించినట్లు సమాచారం. రాజగోపాల్ రెడ్డికి భవిష్యత్తులో కీలక బాధ్యతలు దక్కని భరోసా ఇచ్చినట్లు.

అయితే, సందీప్ హెచ్చరికతో ఇద్దరు ఎమ్మెల్యేలు పూర్తిగా సర్దుకున్నారని చెప్పలేని పరిస్థితి. నిధుల కేటాయింపు, పదవులు, నియోజకవర్గాల్లో ప్రాధాన్యత విషయంలో ఆశించిన మార్పులు వస్తేనే అసంతృప్తి తగ్గే అవకాశం ఉంది. లేదంటే మరోసారి బహిరంగ విమర్శలు తెరపైకి వచ్చే ప్రమాదం లేకపోలేదు.

బీఎం సందీప్‌కు ఈ వ్యవహారం తొలి పరీక్షగా మారింది. ప్రస్తుతానికి వివాదానికి విరామం లభించినా.. కాంగ్రెస్‌లో అసమ్మతి రాజకీయాలకు శాశ్వతంగా తెరపడుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird