కేవలం మామూలు యాక్షన్ తో కూడిన కథ అంటే నడవదు ఇప్పుడు. జనం అభిరుచి మారింది. బలమైన ఎమోషన్ తో కూడిన యాక్షన్ కావాలి. కథలో లోతు వుండాలి. సన్నివేశాల్లో బలం వుండాలి. పాత్రలు అంతకు మించి వుండాలి. అప్పుడు యాక్షన్ తోడు కావాలి. అదీ ఇప్పుడు సినిమాల తీరు. సంపత్ నంది-శర్వానంద్ కాంబినేషన్ లో రాధామోహన్ నిర్మించిన సినిమా భోగి. ఈ నెల 27న విడుదల. ఈ సినిమా ట్రయిలర్ విడుదలైంది. ఈ ట్రయిలర్ చూస్తుంటే బలమైన భావోద్వేగాలకు పెద్ద పీట వేస్తూ, దానికి యాక్షన్ ను జోడించినట్లు కనిపించింది.
బోలెడు మంది చెల్లెళ్లకు అన్నగా శర్వానంద్ కనిపించారు. తెలంగాణ పల్లెల సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేసినట్లు ట్రయిలర్ స్పష్టం చేస్తోంది. అరవైల దశకంలో తెలంగాణ పల్లెల్లో నెలకొన్న దొరల ధాష్టీకాల నేపథ్యంలో కథ అల్లుకున్నట్లు. దానికి చిన్న థ్రిల్లర్ పాయింట్ కలిపినట్లు ట్రయిలర్ కట్ చిన్న హింట్ ఇచ్చింది.
హీరోయిన్ అనుపమ ఒక్క సీన్ లో మాత్రమే కనిపించింది. అది కూడా హీరో ఎలివేషన్ డైలాగులు బలంగా చెబుతూ. ట్రయిలర్ కు భీమ్స్ ఇచ్చిన బ్యాక్ గ్రావుండ్ స్కోర్ బాగుంది. బలమైన ఎమోషన్ తో పాటు, అంతకు మించిన బాధలు, తిరుగుబాటుతో పాటు ఆ సినిమాలో జరిగిన హింసాపోరాటం కూడా వున్నట్లు ఉన్నాయి.
The post భోగి…మండే గుండెల భావోద్వేగం appeared first on iDreamPost.
