అమెరికాలో నవంబర్ చివరి గురువారం థాంక్స్గింగ్ పండుగ జరుపుకుంటారు. కుటుంబ సభ్యులు, కలిసి ఈ వేడుకలో ఎవరైనా ఇతర నగరాలకు ప్రయాణిస్తారు. అలాంటి ముఖ్యమైన పండుగ రోజే దేశంలోని పలు ప్రాంతాలను తీవ్రమైన వాతావరణం కుదిపేసింది. తూర్పు తీరంలో భారీ వర్షాలు, బలమైన గాలులు, వరదలు సంభవించగా.. పశ్చిమ తీరంలో సముద్రపు అలలు తీర ప్రాంతాలను ముంచెత్తాయి. నవంబర్ 26న మొదలైన ఈ వాతావరణ ప్రభావంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విమాన ప్రయాణాలు అస్తవ్యస్తమయ్యాయి. అందుకే దీనిని థాంక్స్‌గివింగ్ స్టార్మ్ అని పిలుస్తున్నారు. ఇది వాతావరణ శాఖ అధికారికంగా పెట్టిన తుఫాన్ పేరు కాదు. పండుగ సమయంలో వచ్చిన తుఫాన్ కావడంతో మీడియా ఈ పేరుతో వార్తలు ప్రసారం చేస్తోంది.
9 లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్ బంద్
తుఫాన్ ప్రభావం ముఖ్యంగా అమెరికా తూర్పు తీరంలో పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, మేరీల్యాండ్, వర్జీనియా రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపించింది. భారీ వర్షాలకు తోడు గంటకు 50 నుంచి 70 మైళ్ల వేగంతో వీచిన గాలులు చెట్లను, విద్యుత్ స్తంభాలను కూల్చేశాయి. దీంతో 9 లక్షలకు పైగా ఇళ్లు, వ్యాపార సంస్థలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. న్యూయార్క్‌లో వరద నీటిలో చిక్కుకున్న వాహనాల నుంచి ప్రజలను రక్షించాల్సి వచ్చింది. న్యూజెర్సీతో పాటు న్యూయార్క్‌లోని కొన్ని ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులు. వాతావరణం కారణంగా రైలు ప్రయాణాలపై ప్రభావం పడింది.
2,200 విమానాలు ఆలస్యం
థాంక్స్‌గివింగ్ సమయంలో అమెరికాలో విమాన ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈసారి తుఫాన్ కారణంగా వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే వేచి ఉండాల్సి వచ్చింది. ఫ్లైట్ ట్రాకింగ్ సంస్థ ఫ్లైట్అవేర్ ప్రకారం నవంబర్ 26న అమెరికాకు సంబంధించిన 2,200కి పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. 400కు పైగా విమానాలను రద్దు చేశారు. వాషింగ్టన్, నగరంలో ప్రధాన విమానాశ్రయాలపై ప్రభావం ఎక్కువగా కనిపించింది. మరోవైపు న్యూయార్క్‌లో ప్రతి ఏడాది జరిగే ప్రసిద్ధ మేసీస్ థాంక్స్‌గివింగ్ డే పరేడ్‌ను కూడా వాయిదా వేశారు. ఈ ఏడాది ఆ వేడుకకు 100వ సంవత్సరం కావడం విశేషం. భారీ బెలూన్లు గాలుల ప్రభావంతో అదుపు తప్పే ప్రమాదం ఉండటంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. చరిత్రలో తొలిసారిగా వాతావరణ కారణాలతో ఈ పరేడ్‌ను వాయిదా వేసి నవంబర్ 28 శనివారానికి మార్చారు.
భారీ వర్షం మరియు శక్తివంతమైన గాలులు న్యూయార్క్‌ను అతలాకుతలం చేస్తున్నాయి! థాంక్స్ గివింగ్ తుఫాను కారణంగా నగరంలోని కొన్ని ప్రాంతాలలో వరదలు సంభవించాయి, హాలిడే ట్రావెల్‌కు అంతరాయం ఏర్పడింది మరియు ఐకానిక్ మాకీ థాంక్స్ గివింగ్ డే పరేడ్‌ను వాయిదా వేయవలసి వచ్చింది.
#dailypoint #NewYorkCity #ThanksgivingStorm #Flooding #Weather Delimitation Bill Pahalgam Makkah #ไฟไหม้ #INDAvsSLA క్వాంటం— డైలీ పాయింట్ (@dailypointnews) నవంబర్ 27, 2026
అసలు ఈ తుఫాన్ ఎందుకు వచ్చింది?
నవంబర్ చివరి వారంలో ఉత్తర అమెరికా నుంచి వచ్చే చల్లని గాలులు, దక్షిణ ప్రాంతాలు అట్లాంటిక్ సముద్రం నుంచి వచ్చే వెచ్చని తేమ గాలులు కలిసినప్పుడు అల్పపీడన వ్యవస్థలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈసారి అట్లాంటిక్ తీరంలో ఏర్పడిన బలమైన అల్పపీడన వ్యవస్థ భారీ వర్షాలు, ఈదురుగాలులకు కారణమైంది. సముద్రం నుంచి భూమి వైపు బలంగా వీచే గాలులు తీర ప్రాంతాల నీటిమట్టాన్ని పెంచాయి. దీనికి సాధారణంగా వచ్చే అధిక ఆటుపోట్లు తోడవడంతో లోతట్టు ప్రాంతాల వరద ముప్పు పెరిగింది. పశ్చిమ తీరంలో మాత్రం మరో పరిస్థితి కనిపించింది. పసిఫిక్ మహాసముద్రం నుంచి వచ్చిన తేమ గాలులు వర్షాలకు కారణమయ్యాయి. అదే సమయంలో కింగ్ టైడ్స్ ప్రభావంతో సముద్రపు నీరు సాధారణం కంటే ఎక్కువ ఎత్తుకు చేరింది. కింగ్ టైడ్స్ అంటే చంద్రుడు, సూర్యుడు, భూమి ఒక ప్రత్యేక స్థితిలో ఉన్నప్పుడు అత్యంత ఎత్తైన సహజ ఆటుపోట్లు. వీటివల్ల తీర ప్రాంతాల నీరు రోడ్లపైకి చేరి వరద పరిస్థితులు ఏర్పడతాయి.
శాండీ తుఫాన్ తర్వాత మళ్లీ ఆందోళన
అమెరికా తూర్పు తీరంలో సముద్రపు నీటిమట్టం పెరగడం అధికారులను మరింత ఆందోళనకు గురిచేసింది. 2012లో వచ్చిన సూపర్‌స్టార్మ్ శాండీ తర్వాత కొన్ని భాగాల ఇంతటి ఎత్తులో నీటిమట్టం నమోదయ్యే వార్తా కథనాలు మొదలయ్యాయి. మరోవైపు కాలిఫోర్నియాలోని శాన్ఫ్రాన్సిస్కో బే ప్రాంతంలో కింగ్ టైడ్స్ కారణంగా రోడ్లు నీట మునిగాయి. కొన్ని తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు సూచించారు. మధ్య అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో మంచు, భారీ వర్షాలు కురిశాయి. మిస్సోరిలో మంచు కారణంగా రవాణాకు అంతరాయం ఏర్పడింది. పసిఫిక్ నార్త్‌వెస్ట్ ప్రాంతంలోనూ వర్షాలు, బలమైన గాలుల హెచ్చరికలు జారీ అయ్యాయి. తుఫాన్ తగ్గుతున్నప్పటికీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
The post 9 లక్షల ఇళ్లకు కరెంట్ కట్, వందల విమానాలు రద్దు appeared first on iDreamPost.
