Home సినిమా షావోమీ నుంచి వెరైటీ వాషింగ్ మెషీన్! ఇదే ఫస్ట్ టైం! – Andhra Waves

షావోమీ నుంచి వెరైటీ వాషింగ్ మెషీన్! ఇదే ఫస్ట్ టైం! – Andhra Waves

by andhra andhrawave
0 comments
షావోమీ నుంచి వెరైటీ వాషింగ్ మెషీన్! ఇదే ఫస్ట్ టైం!


పిల్లల దుస్తులు, లోదుస్తులు, సాక్స్, సిల్క్ బట్టలను ఇతర దుస్తులతో కలిపి ఉతకడం ఇష్టం లేదా? అలాంటి వారి కోసం షావోమీ కొత్త వాషింగ్ మెషీన్‌ను తీసుకొచ్చింది. చైనాలో మిజియా హెల్త్ వాష్ ప్రో 2kg డ్యూయెల్ డ్రమ్ వాషర్ డ్రైయర్ పేరుతో ఈ పరికరాన్ని విడుదల చేసింది. ఇందులో రెండు ప్రత్యేక డ్రమ్స్ ఉంటాయి. ఒక్కో డ్రమ్‌లో కిలో బట్టలు ఉతకవచ్చు. నీటిని సర్క్యులేషన్ వ్యవస్థలు, డ్రయింగ్ డక్ట్స్ ఉండటంతో రెండు భాగాల్లోని దుస్తులు ఒకదానితో మరొకటి కలవవు. ముఖ్యంగా చిన్న బట్టలు, లోదుస్తులు, పిల్లల సున్నితమైన ఫ్యాబ్రిక్స్‌ను విడిగా ఉతకడానికి ఇది ఉపయోగపడుతుంది.

మొత్తం 2 కిలోల వాషింగ్ కెపాసిటీ

ఈ వాషర్-డ్రయర్‌లో మొత్తం 2 కిలోల బట్టలు ఉతకవచ్చు. ఆరబెట్టే సామర్థ్యం మాత్రం 1 కిలో మాత్రమే. అంటే ఒక్కో డ్రమ్‌లో కిలో బట్టలు ఉతికే వీలుండగా, 500 గ్రాముల వరకు మాత్రమే ఆరబెట్టవచ్చు. రెండు డ్రామ్స్ వ్యాసం 228 మిల్లీమీటర్లుగా ఉంది. ఇందులో డైరెక్ట్ డ్రైవ్ మోటార్ ఇచ్చారు. ఇది డ్రమ్ వేగాన్ని నియంత్రించడంలో సాయపడుతుంది. కంపెనీ నిర్వహించిన పరీక్షల్లో ప్రోటీన్ మరకలను తొలగించే రేషియో 1.87గా, రక్తపు మరకలను తొలగించే రేషియో 1.92గా నమోదైనట్లు ప్రదర్శించబడింది. ఇవి కంపెనీ వెల్లడించిన పరీక్ష ప్రకారం.

34 రకాల మరకలకు ప్రత్యేక వాషింగ్ ప్రోగ్రామ్‌లు

ఈ మెషీన్‌లో మొత్తం 34 రకాల మరకలను తొలగించేందుకు ప్రత్యేక వాషింగ్ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. పాలు, పండ్లు, జామ్, రక్తం, కాఫీ వంటి మరకలకు అనుగుణంగా వాషింగ్ మోడ్ ఎంచుకోవచ్చు. తక్కువ బరువున్న దుస్తుల కోసం 40 నిమిషాల క్విక్ వాష్ అండ్ డ్రై మోడ్ కూడా ఉంది. సిల్క్ వంటి సున్నితమైన బట్టలు పాడవకుండా ఉండేందుకు 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో లో-టెంపరేచర్ డ్రైయింగ్ సదుపాయం ఇచ్చారు. ఒక్కో డ్రమ్‌కు 200 మిల్లీలీటర్ల సామర్థ్యం ఉన్న ఆటోమెటిక్ డిటర్జెంట్ డిస్పెన్సర్ ఉంటుంది. దుస్తుల పరిమాణానికి తగినట్లుగా డిటర్జెంట్‌ను మెషీన్‌నే విడుదల చేస్తుంది.

95 డిగ్రీ డ్రమ్ క్లీనింగ్

బట్టలు ఉతికిన తర్వాత మెషీన్‌లోనే రాత్రంతా దుర్వాసన రాకుండా ఫ్రెష్ ఎయిర్ సర్క్యులేషన్ సిస్టమ్ పనిచేస్తుంది. అవసరమైనప్పుడు ఇది ఆటోమేటిక్‌గా ప్రారంభమై గాలి ప్రసరణను అందిస్తుంది. పెరుగుదలను తగ్గించడంలో సాయపడుతుందని కంపెనీ చెబుతోంది. 95 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో డ్రమ్ క్లీనింగ్ మోడ్ కూడా ఉంది. హై టెంపరేచర్ స్టెరిలైజేషన్ ఫీచర్ ఇచ్చారు. ఈ మెషీన్ లోతు 438 మిల్లీమీటర్లు మాత్రమే. గోడకు రంధ్రాలు చేయాల్సిన అవసరం లేకుండా నేలపై, కౌంటర్‌పై లేదా మరో వాషింగ్ మెషీన్ పైన కూడా అమర్చవచ్చు.

భారత్‌లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

స్మార్ట్ ఫీచర్ల విషయానికి వస్తే మిజియా యాప్, హైపర్ కనెక్ట్ సపోర్ట్ ఉంది. Xiao AI వాయిస్ కమాండ్స్‌తోనూ మెషీన్‌ను నియంత్రించవచ్చు. చైనాలో దీని రిటైల్ ధర 2,999 యువాన్లుగా నిర్ణయించారు. ప్రభుత్వ సబ్సిడీ ధర 2,199 యువకులకు తగ్గుతుంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.30,700. అయితే ఈ ధర చైనా ప్రభుత్వ సబ్సిడీతో లభించే మొత్తం మాత్రమే. ప్రస్తుతం చైనా మార్కెట్‌లోనే ఈ వాషర్-డ్రయర్ అందుబాటులో ఉంది. భారత్‌లో విడుదల తేదీ, ధరపై షావోమీ ఎలాంటి ప్రకటన చేయలేదు. 2 కిలోల వాషింగ్ కెపాసిటీ మాత్రమే ఉండటంతో ఇది ఇంట్లోని ప్రధాన వాషింగ్ మెషీన్‌కు ప్రత్యామ్నాయం కాదు. చిన్న దుస్తులను విడిగా ఉతకడానికి అదనపు పరికరంగా ఉపయోగపడుతుంది.

మరిన్ని టెక్నాలజీ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

The post షావోమీ నుంచి వెరైటీ వాషింగ్ మెషీన్! ఇదే ఫస్ట్ టైం! iDreamPostలో మొదట కనిపించారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird