
తెలుగు పాటకు, మన కీర్తనలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఆదరణ ఉందో మరోసారి నిరూపితమైంది. శతాబ్దాల క్రితం అన్నమాచార్యులు రచించిన ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే’ కీర్తన ఇప్పుడు స్విట్జర్లాండ్‌లో మార్మోగింది. అక్కడ జరిగిన 2026 సోల్స్‌బర్గ్ ఫెస్టివల్‌లో స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ కాపెల్లా గాయక బృందం ‘చాంటిక్లియర్’ ఈ కీర్తనను అలపించింది. విదేశీ గాయకుల గొంతుల్లో మన తెలుగు కీర్తన వినిపించడంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ప్రదర్శనలో ప్రత్యేకత ఏంటంటే.. కీర్తనను సాధారణంగా మనం వినే శైలిలో కాకుండా, పాశ్చాత్య కాపెల్లా సంగీత పద్ధతిలో ఆలపించారు. ఎలాంటి వాయిద్యాల తోడ్పాటు లేకుండా కేవలం గొంతులతోనే విభిన్న స్వరాలను పలికిస్తూ బృందం ఈ పాటను ప్రదర్శించింది. ఒకరి స్వరానికి మరొకరి స్వరం తోడవుతూ సాగిన ఈ ప్రదర్శన వినేవారికి కొత్త అనుభూతిని కలిగిస్తోంది.
ఈ ప్రదర్శన వెనుక మరో ఆసక్తికరమైన వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు వినీల్ గరిసా మహల్. భారతీయ మూలాలున్న వినీల్ చాంటిక్లియర్ బృందంలో మెయిన్ సింగర్ గా కొనసాగుతున్నారు. ఈ బృందంలో చేరిన తొలి భారతీయ మూలాలున్న గాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రుల కారులో ప్రయాణిస్తున్నప్పుడు వినిపించే భారతీయ కీర్తనలు తన ప్రయాణంపై ప్రభావం చూపాయని ఆయన సంగీతాన్ని అందించారు.
ఇక్కడ ‘బ్రహ్మమొక్కటే’ కీర్తన ప్రత్యేకతను గుర్తుచేసుకోవాలి. అన్నమాచార్యులు రచించిన ఈ కీర్తనలో భగవంతుడు ఒక్కడే అనే ఆధ్యాత్మిక భావనతో పాటు మనుషులందరూ సమానమే అనే సందేశం ఉంటుంది. కులం, మతం, హోదా వంటి తేడాలు మనుషుల మధ్య ఉన్నా.. అందరిలోనూ ఉన్న పరమాత్మ ఒక్కటే అనే భావాన్ని ఈ పాట వివరిస్తుంది. అందుకే ఇన్ని శతాబ్దాలు గడిచినా ఈ కీర్తనకు ఆదరణ తగ్గలేదు.
ఇది కూడా చదవండి: రామాయణ ఎఫెక్ట్.. జటాయు రాక్ విజిటర్స్ డబుల్ అయ్యారు.!
‘అన్నమయ్య’ సినిమాలో ఎం.ఎం. కీరవాణి సంగీతంలో ఈ కీర్తన మరింతగా ప్రజల్లోకి వెళ్లింది. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఈ పాటకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు విదేశీ గాయక బృందం కూడా ఇదే కీర్తనను తమదైన శైలిలో అలపించడం తెలుగు సంగీత ప్రియులకు ఆనందాన్ని కలిగిస్తోంది.
మొత్తానికి అన్నమయ్య రాసిన ఓ తెలుగు కీర్తన స్విట్జర్లాండ్‌లోని అంతర్జాతీయ సంగీత వేదికపై వినిపించడం మన సంగీతానికి దక్కిన మరో గుర్తింపు. భాష తెలియకపోయినా సంగీతం ద్వారా భావాన్ని ఆస్వాదించవచ్చని ఈ ప్రదర్శన మరోసారి చూపించింది.
మీకు నచ్చవచ్చు:
బాహుబలి కాంబో రిపీట్.. వారణాసి తర్వాత ప్రభాస్‌తో రాజమౌళి సినిమా.!
సందీప్ రెడ్డి వైరల్ కామెంట్స్.. హాలీవుడ్ స్టార్స్ కంటే చిరంజీవి గొప్ప.!
[Annamacharya, Brahmam Okkate, Switzerland, Solsberg Festival, Telugu Keerthana]
