Home ఆంధ్రప్రదేశ్ YSRCP: ఎన్నికలంటే వైసిపికి భయమా.. ఎందుకు ఈ హింస.. కుట్రలు.. – Andhra Waves

YSRCP: ఎన్నికలంటే వైసిపికి భయమా.. ఎందుకు ఈ హింస.. కుట్రలు.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper



YSRCP: ప్రజాస్వామ్యంపై వైసీపీకి ఎలాంటి నమ్మకం లేదు. ఆ పార్టీ మొత్తం హింసాత్మక విధానంలో అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. 2019 ఎన్నికల్లో సానుభూతి కోసం సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని బలి తీసుకున్నారు. సానుభూతి ద్వారా విజయం సాధించారు.. గతంలో వైసిపి అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగిన తీరు.. అరాచకాలు చోటు చేసుకున్న తీరు అందరికీ తెలుసు. నాడు రాష్ట్రవ్యాప్తంగా వైసిపి అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసిందో అందరికీ తెలుసు. వైసిపి చేసిన పాపాలకు ప్రజలు దారుణంగా శిక్ష విధించారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా, 11 సీట్లకే పరిమితం చేశారు.

అధికారం కోల్పోయిన నాటి నుంచి అభివృద్ధిని.. సంక్షేమాన్ని ఆదుకునేందుకు వైసిపి పనిచేస్తూనే ఉంది. మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల రిక్రూట్మెంట్ చేస్తే.. దానిని అడ్డుకొని ఏకంగా 300 కేసులు వేసింది. అయినప్పటికీ కేసులను ఛేదించి ప్రభుత్వం అద్భుతంగా డీఎస్సీ నిర్వహించింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది. ఇప్పుడు స్థానిక ఎన్నికలకు తగిన విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. స్థానిక ఎన్నికలు పూర్తయితే కేంద్ర గ్రాంట్ల ద్వారా ఏపీకి వేల కోట్లు వస్తాయి. వీటి ద్వారా అభివృద్ధి పనులు జరుగుతాయి. ఏపీలో అభివృద్ధి జరగడం వైసిపికి ఇష్టం లేదు. పైగా రోడ్డును వైసిపి నాయకులు దున్నేస్తున్నారు. వైసీపీ చేస్తున్న అరాచకం వల్ల.. ఆ పార్టీ నాయకులే స్థానిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నారు. అసలే ప్రతిపక్ష హోదాను కోల్పోయి దారుణంగా ఉన్న ఆ పార్టీకి.. స్థానిక ఎన్నికల్లో ఓడిపోతే అసలు ఉనికి అనేది ఉండదు. ఆ భయం వల్లే స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి ఏకంగా 60 కేసులు వేసింది. వెనకబడిన వారికి హక్కులు.. ఎస్ఐఆర్ అంటూ కేసులు వేసింది. వెనుకబడిన వారికి అవకాశాలను అడ్డుకున్నప్పటికీ.. ప్రభుత్వం వరకు న్యాయం చేయగలిగింది. పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించింది.

ఇలా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఎన్నికలు ఆగే పరిస్థితి లేదు. దీంతో ఎన్నికలను అడ్డుకోవడానికి విధ్వంసానికి దిగింది.. వైసిపి ఫిర్యాదు 19 మున్సిపాలిటీలలో 8 ఉమ్మడి కడప జిల్లా పరిధిలోనే ఉండటం విశేషం. ఉమ్మడి కడప జిల్లాలో స్థానిక ఎన్నికలను అడ్డుకునే విధంగా వైసిపి కుట్రలు చేస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లా రాజంపేట.. ఎర్రగుంట్ల.. కడప.. రాయచోటి.. కమలాపురం.. ప్రొద్దుటూరు.. మైదుకూరు.. పుంగనూరులో వైసిపి నాయకులు అలజడి సృష్టించారు. ఇదే సాకుగా చూపి స్థానిక ఎన్నికలను ఆడుకోవడానికి వైసిపి కోర్టు కూడా వెళ్ళింది. అయితే సుప్రీంకోర్టు ఫ్యాన్ పార్టీ నేతల విజ్ఞప్తులను పూర్తిగా తిరస్కరించింది. పైగా వారి విజ్ఞప్తులను కొన్ని ప్రాంతాల వరకు పరిమితం చేసింది. నామినేషన్ల విషయంలో నిర్ణయాధికారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు వదిలేసింది. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడం.. అభివృద్ధిని నిలుపుదల చేయడానికి వైసిపి చేయని కుట్రలు లేవు. అమరావతి.. పోలవరం..

ఇలా అనేక అంశాల్లో వైసిపి వైఖరి ఇప్పటికే స్పష్టంగా ఉంది. రాష్ట్ర అభివృద్ధిని ఆడుకోవడానికి కోర్టు కేసులతో బ్రేకులు వేస్తున్నారు వైసిపి.. చివరికి సొంత కేసుల్లో కూడా జగన్ ఇదే వ్యవహార శైలి కొనసాగిస్తున్నారు. అక్రమ ఆస్తుల కేసులో ముందుకు సాగకుండా కోర్టు విచారణలో వివిధ పిటిషన్లు వేస్తున్నారు. వివేక హత్య కేసు విచారణ కూడా ముందుకు సాగకుండా, చెల్లి మీద ఆరోపణలు చేస్తున్నారు. సిబిఐ అధికారుల మీద కోర్టు వరకు వెళ్తున్నారు. చివరికి సొంత సోదరి షర్మిల తో ఆస్తి తగాదాలు వస్తే.. దాని మీద కూడా ఎన్సిఎల్టికీ వెళ్లారు. చివరికి షర్మిలను రోడ్డు మీద పడేశారు. షర్మిల కూతురు వివాహం జరగకుండా ఉన్నారు. అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird